జాతీయ వార్తలు

ఆ ఇల్లు మృత్యుకుహరమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: ఉత్తర ఢిల్లీ ప్రాంతంలోని బురాలి ప్రాంతంలో 11 మంది అనుమానాస్పద మృతి వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే మతపరమైన విశ్వాసాల వల్ల వారు మృతి చెంది ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన 11 మందిలో 10మంది కళ్లకు గుడ్డలు కట్టుకుని, చేతులు కట్టివేసి ఇంట్లో వేళ్లాడుతూ ఉన్న స్థితిలో మరణించి ఉన్నారు. ఒక వృద్ధురాలు వేరే గదిలో మృతి చెంది ఉంది. వీరి మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. మరణించిన వారిలో ఎనిమిది మంది ఎలాంటి బాధపడినట్టు ఆనవాళ్లు లేవని, వీరంతా ఉరివల్లే మృతి చెందారని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. గొంతు నులమడం కాని, ఘర్షణ జరిగినట్టు గాని ఎలాంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. మృతిచెందిన 11 మందిలో పది మంది సీలింగ్‌లో ఉన్న ఐరన్ మెష్‌కు ఉరి వేసుకున్నారని, 77 ఏళ్ల వృద్ధురాలు నారాయణ దేవి మాత్రం వేరే గదిలో నేలపై పడి ఉందని చెప్పారు. తొలుత ఈమెను గొంతు నులిమి హత్య చేసి ఉంటారని భావించామని, కాని ఆమెను పాక్షికంగా ఉరి తీయడం వల్ల మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారని ఆయన తెలిపారు. ఆమె ఉరికి ఉపయోగించిన తాడను ఆమె మృతదేహం వద్ద లభించిందని చెప్పారు. ప్రాథమికంగా జరిపిన పోస్టుమార్టం అనంతరం వారు ఉరి వేసుకోవడం వల్లే మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. అయితే తుది నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు.
మృతులు మతపరమైన విశ్వాసాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న నోట్‌లో ‘ఒక్కరు చనిపోకూడదు, కాని గొప్ప కార్యాన్ని సాధించాలి’ అని ఉందని ఒక అధికారి చెప్పారు. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని, వారు వాటికి అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు.
మృతి చెందిన వారిలో నారాయణ దేవి, ఆమెకుమార్తె ప్రతిభ (57), నారాయణ దేవి ఇద్దరు కుమారులు భావనేష్ (50), లలిత్ భాటియా (45), భావనేష్ భార్య సవిత (48), వారి ముగ్గురు పిల్లలు మీను (23), నిధి (25), ధృవ్ (15), లలిత్ భాటియా భార్య టీనా (42), వారి పదహారేళ్ల కుమారుడు వివరామ్, ప్రతిభ కుమార్తె ప్రియాంక (33) ఉన్నారు. ప్రియాంకకు గత నెలలోనే నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివరిలో పెళ్లి జరగాల్సి ఉంది.