జాతీయ వార్తలు

ఇది ప్రజా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూలై 4: ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య అధికారాల అమలుకు సంబంధించిన సంఘర్షణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా విజయానికి నాంది పలుకుతుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజలకు, ప్రజాస్వామ్యం గెలిచారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన మాట్లాడుతూ లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి వీలులేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిందన్నారు. తీర్పు వచ్చిన వెంటనే కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 2015 ఫిబ్రవరి ఎన్నికల్లో తమకు ప్రజలు తిరుగులేని మెజార్టీ ఇచ్చారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అండనిలిచే విధంగా తీర్పు ఉందన్నారు. చారిత్రక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ప్రజల తరఫున అభినందనలు తెలిపారు. తీర్పు పూర్తి పాఠాన్ని ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించరాదని కోర్టు గట్టిగా చెప్పిందన్నారు. ఉప ముఖ్యమంత్రి శిసోడియా మాట్లాడుతూ సంక్షేమ ప్రభుత్వం పనిచేసేందుకు అనేక అవరోధాలు తలెత్తాయని, తీర్పు వల్ల అన్ని అడ్డంకులు తొలిగాయన్నారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం, రేషన్ స్కీం అమలు అన్ని అంశాల్లో అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ తీర్పుపై స్పందిస్తూ పాలనపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పరస్పరం నిందించుకునే విధమైన చర్యలకు తీర్పు చెక్ పెట్టిందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ ప్రతినిధి అజయ్ మకేన్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిందని, అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.
ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న సమస్యల వల్ల దేశ రాజధానిలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఢిల్లీ బీజేపీ ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ మాట్లాడుతూ ఈ తీర్పు ద్వారా ఢిల్లీ కేంద్రపాలిత రాష్టమ్రని కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఇకనైనా ఢిల్లీకి రాష్టహ్రోదా కావాలన్న డిమాండ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ వదులుకోవాలన్నారు. ఈ తీర్పు ద్వారా ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ సమన్వయంతో పనిచేయాలని కోర్టు ఆదేశించిందన్నారు.
కాగా తమ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంను ఢిల్లీముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభినందించారు. తాను త్వరలో చిదంబరంను కలుసుకుని కృతజ్ఞతలు తెలియచేస్తానన్నారు. ఢిల్లీ ప్రజల తరఫున చిదంబరం మంచి వాదనలు వినిపించారని ఆయన కొనియాడారు.