జాతీయ వార్తలు

ఇజ్రాయిల్-పంజాబ్ మధ్య అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 6: జలసంరక్షణ, భద్రతా అంశాలపై సాంకేతిక నైపుణ్యం, ఇతర అంశాలను ఒకరికొకరు పంచుకోవడానికి పంజాబ్, ఇజ్రాయిల్ దేశం మధ్య అంగీకారం కుదిరింది. ముఖ్యంగా వ్యవసాయం, సామాజిక అభివృద్ధి అంశాలలో ఇరువురు ఒకరుకొకరు సహకరించుకోవాలని నిర్ణయించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి డేనియల్ కారమ్ ఇక్కడ జరిపిన తేనీటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ నెలాఖరున తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా డేనియల్ కారమ్ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. దీనికి సీఎం అంగీకరించారు. దీనిపై ఐదుగురితో ఒక సబ్‌కమిటీని ఏర్పాటు చేసి వ్యవసాయంలో ఇజ్రాయిల్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. ఇజ్రాయిల్ పర్యటనలో ఆ దేశంతో కొన్ని అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవాలని పంజాబ్ భావిస్తోంది. ముఖ్యంగా తక్కువ నీటి వాడకంతో వ్యవసాయం, వృథానీటిని సద్వినియోగపర్చుకునే విధానాలపై దృష్టి సారిస్తుంది. అదే సమయంలో భద్రత, పోలీసులకు శిక్షణ వంటి అంశాలపై కూడా ఇజ్రాయిల్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటోంది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు 2011లో పంజాబ్ పోలీసులు ఏర్పాటు చేసిన స్పెషల్ వెపన్ అండ్ టాక్టిక్స్ టీమ్‌కు ఇజ్రాయిలే శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణ నైపుణ్యంతోనే ఈ టీమ్ 2015లో గురుదాస్‌పూర్‌లోని దీనానగర్ పోలీసుస్టేషన్‌పై ఉగ్రవాదలు జరిపిన దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంది. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతున్న ఇజ్రాయిల్ సహకారంతో కొన్ని పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని పంజాబ్ ప్రభుత్వం యోచిస్తోంది.