జాతీయ వార్తలు

నేత్రదానానికి స్వచ్ఛందంగా ముందుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 7: ప్రజల్లో స్వచ్ఛందంగా నేత్ర దానం చేసేందుకు ముందుకు వచ్చే సంస్కృతిని పెంపొందించాలని భారత ఉపరాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ 32వ ఇంట్రాక్యులర్ ఇంప్లాంట్ రిఫ్రాక్టివ్ సర్జరీ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో నేత్ర సంరక్షణపై అవగాహన పెంపొందించాలని కోరారు. కేంద్రం సమగ్ర నేత్ర పరిరక్షణ సేవల పథకాన్ని ప్రారంభిస్తున్నదని, దీనిపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు చైతన్యం కల్పించాలన్నారు. శరీరంలో అన్ని అవయవాల కంటే నేత్రాలు ప్రధానమైనవని, కంటి రోగాల నివారణకు ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. కంటి సమస్యలను పారదోలేందుకు నేత్ర వైద్యులు బహుముఖ వ్యూహంతో కదలాలన్నారు. 2017-18లో 50 వేల మంది నేత్రాలను దానం చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాని ఇంతవరకు లక్ష్యాన్ని దాటి 69,343 మంది నేత్రాలను దానం చేశారన్నారు. నేత్ర దానం విషయంలో సామాజిక మాద్యమాలు, ప్రచార సాధానాల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులు, యువకులు ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం, ధ్యానం చేసే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజుల్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు కూడా కళ్లజోడు పెట్టుకుంటున్నారని, పౌష్టికాహార లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఆహార విధానాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు సదస్సుల ద్వారా ప్రజల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించే విధంగా సందేశాలు ఇవ్వాలన్నారు. జీవన విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల మదుమేహ వ్యాధిబారినపడుతున్నామన్నారు. ఆరోగ్యం బాగుంటే సంపద ఉన్నట్లేనన్నారు. కేవలం సంపాదన వల్ల ప్రయోజనం ఏమీలేదని, ఆరోగ్యం చెడిపోతే చేసేదేమీ ఉండదన్నారు. ప్రస్తుతం విద్యా విధానంలో ఆరోగ్య పరిరక్షణకు అవలంభిస్తున్న విధానాలను సమీక్షించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో పిల్లలు ఎక్కువగా కంటి జబ్బుల బారినపడుతున్నారన్నారు. కేంద్రం ఆరోగ్య పరిరక్షణ స్కీంకు బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. పది కోట్ల మందికి ఈ స్కీం ప్రయోజనాలు చేకూరుతాయని, ప్రతి కుటుంబానికి ఐదు లక్షల మేర ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. పేదలకు విస్తృతంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు ముందుకు రావాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న స్కిల్ ఇండియా, స్మార్ట్ సీటీస్ తదితర స్కీంల గురించి ఆయన వివరించారు. భారత్ ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.