జాతీయ వార్తలు

వివాహ పవిత్రతను దెబ్బతీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: వివాహేతర సంబంధాల విషయంలో పురుషులతో సమానంగా మహిళలను పరిగణించి వారిని కూడా ఐపీసీ సెక్షన్ 497 పరిధిలోకి తీసుకురావాలని దాఖలైన పిటిషన్ వాదనలను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. పురుషులతో సమానంగా మహిళలను ఈ సెక్షన్ కింద పరిగణిస్తే వివాహబంధానికి ఉన్న పవిత్రత మంటగలుస్తుందని, దీనిని పరిరక్షించాలని కేంద్రం సుప్రీంకోర్టు బుధవారం నివేదించింది. అంతకు ముందు పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 497 కింద వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు మాత్రమే శిక్షలు విధిస్తున్నారని, అదే భార్య వివాహేతర సంబంధం ఉంటే శిక్షించరని, ఈ చట్టాన్ని తొలగించి, ఎవరు తప్పు చేసినా శిక్ష ఒకటే విధంగా ఉండాలని సుప్రీంకోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కేంద్రం గట్టిగావాదించింది. భారతీయ నైతిక విలువలకు విరుద్ధంగా పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారని, ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్రం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వివాహ బంధాన్ని, పవిత్రతను పరిరక్షించేందుకు సెక్షన్ 497 రక్షణ కవచం లాంటిదని కేంద్రం పేర్కొంది. కేరళకు చెందిన జోసెఫ్ షైన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషనర్ తరఫున న్యాయవాది సువిదత్ సుందరం వాదనలు వినిపించారు. ఐపీసీ 497, సెక్షన్ 198(2) సీఆర్‌పీసీ చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన సెక్షన్ అన్నారు. రాజ్యాంగంలోని 14,15,21వ అధికరణలకు విరుద్ధంగా, పురుషుల హక్కులను కాలరాచే విధంగా ఈ చట్టం ఉందన్నారు.
భార్యా, భర్తల్లో భార్య వివాహేతర సంబంధాలకు పాల్పడితే, భారతీయ చట్టాల ప్రకారం నేరం కాదు. ఇది ఒక రకంగా పురుషుల పట్ల వివక్షతను ప్రదర్శించేందుకు ఆస్కారం ఇస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 5వ తేదీన ఈ అంశంపై పిల్ దాఖలు కాగా, రాజ్యాంగ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నివేదించారు. సామాజికంగా చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఐపీసీ సెక్షన్ వివక్షతను ప్రదర్శించేదిగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. 1954, 1985, 1988 సంవత్సరాల్లో ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఐపీసీ సెక్షన్ 497 సమర్ధనీయమని పేర్కొంది. కాగా ఈ సెక్షన్ కింద వివాహిత మహిళల్లో లైంగిక సంబంధాలు పెట్టుకుంటేనే చట్ట వ్యతిరేకం. అదే వితంతువులు, సెక్స్‌వర్కర్లు, అవివాహితులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే ఈ సెక్షన్ వర్తించదు. ఈ విషయాన్ని బ్రిజ్ లాల్ బిష్నోయి వర్సెస్ స్టేట్ 1996 కేసులో ఢిల్లీ హైకోర్టు ధృవీకరించింది.