జాతీయ వార్తలు

అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వలని పార్లమెంట్‌లో ప్రతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల నాయకులకు ఆ పార్టీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం వామపక్ష పార్టీల నాయకులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు తోట నరసింహం, రవీంద్రబాబు కలిశారు. విభజన హామీల సాధనకోసం తెలుగుదేశం పార్టీ చేసే పోరాటానికి మద్దతివ్వాలని పార్లమెంట్‌లో ప్రతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నాయకులను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కోరారు. అలాగే భజన సమయంలో కేంద్ర ఇచ్చిన హామీలపై రూపొందించిన పుస్తకాన్ని, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాసిన లేఖలను వివిధ పార్టీల నేతలకు అందజేశారు. అనంతరం తెలుగుదేశం ఎంపీలు తోట నరసింహం, పీ.రవీంద్రబాబు విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రాకు ప్రత్యేకహోదా విషయంలో మద్దతునిస్తామని వివిధ పార్టీల నాయకులు వెల్లడించినట్టు చెప్పారు. తెలుగుదేశం ఎంపీలు ఆరు బృందాలుగా ఏర్పడి వివిధ రాష్ట్రాలలోని పార్టీల నాయకులను కలుస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 పార్టీల నాయకులను 50 మందికిపైగా నాయకులను కలవనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ విభజనతో ఏపీకి నష్టం జరిగిందని, ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ఐదేళ్లు గడుస్తున్నా ఏపీకి ఇచ్చిన హామీలు కేంద్రం అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని రాజ్యసభలో పట్టుబట్టినట్టు ఏచూరి స్పష్టం చేశారు.
కనిమొళిని కలిసిన టీడీపీ ఎంపీలు
చెన్నై: పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో మోదీ ప్రభుత్వంపై తాము పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు డిఎంకె నేత కనిమొళిని కలిసి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎంపీలు సీఎం రమేష్ నేతృత్వంలోని ముగ్గురు పార్టీ ఎంపీలు డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి కుమార్తె కనిమొళిని కలిసి తాము లోక్‌సభలో పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీ ఎంపీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేసిందని, దీంతో తాము గత పార్లమెంట్ సమావేశాల్లో సైతం మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చామని టీడీపీ పేర్కొంది. ‘మేమెప్పుడూ వారితోనే ఉంటాం. వారి డిమాండ్‌కు మద్దతు తెలియజేస్తున్నాం. వారు ఏం అడుగుతున్నారు? చట్టసభల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమనే కదా కోరుతున్నారు’ అని కనిమొళి విలేఖరులతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కనిమొళికి అందజేసినట్టు సీఎం రమేష్ తెలిపారు. అంతకుముందు టీడీపీ బృందాన్ని కలవడానికి తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, ఒ.పన్నీరుసెల్వం నిరాకరించారు. కాగా, తాము సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ తీసుకునే ఇక్కడకు వచ్చామని, కాని వారు బీజేపీ సూచనల మేరకు తమను కలవడానికి నిరాకరించి ఉండవచ్చునని సీఎం రమేష్ తెలిపారు.