జాతీయ వార్తలు

ఎయర్‌లైన్స్ అదనపు ఛార్జీలపై దర్యాప్తు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జులై 18: ఎయర్‌లైన్స్‌లో అదనంగా ఛార్జీలు వసూలు చేయడంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలపై ఎయర్‌లైన్స్ వివక్ష చూపుతున్నాయని, దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించారు. విమానయాన సంస్థలు ప్రాధాన్యత గల సీట్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న విషయాన్ని ఎంపీలు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకురాలు ఛాయా వర్మ మాట్లాడుతూ గత నెల 29న ఢిల్లీ నుంచి రాయ్‌పురాకు ఇండిగో విమానంలో వెళ్తున్న సమయంలో ముందు సీట్లు ఖాళీగా ఉన్నా వాటిలో కూర్చునేందుకు అనుమతివ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా ముందు వరసలో ఖాళీగా ఉన్న సీట్లపై రూ.600 చెల్లించి వాటిలో కూర్చోవచ్చని ఆ సంస్థ ప్రకటించిందని ఆమె చెప్పారు. డీఎంకే నాయకుడు తిరుచ్చి శివ మాట్లాడుతూ ప్రాధాన్యత గల సీట్ల కేటాయంపులో విమానయాన సంస్థలు వివక్ష చూపుతున్నాయని, విమానం బయలుదేరే సమయానికి ఆ ఛార్జీలను 400 శాతం పెంచుతున్నాయని ఆరోపించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ ప్రయాణికులు, వైమానిక సంస్థల మధ్య వాణిజ్య ఒప్పందంలోని నిబంధల ప్రకారమే విమాన సేవలు అందుతాయన్నారు. జాతీయ కెరీర్ ఇండియా కూడా విండో సీట్లను అమ్ముతోందని, ఈ పద్ధతి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నదేనని అన్నారు. వీటిపై పూర్తిస్థాయలో అధ్యయనం చేసిన తర్వాతే అమలు చేశామని సిన్హా చెప్పారు. ఒకవేళ ఎవరైన తనకు అనుకూలంగా సీటు ఉండాలని కోరుకుంటే సదరు ప్రయాణికుడు కిటికీ దగ్గరలోని సీటు వద్ద కూర్చునేందుకు వీలుంటుందని ఆయన చెప్పారు.