జాతీయ వార్తలు

‘అడల్టరీ’ చట్టంపై రిజర్వ్‌లో తుది తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అక్రమ సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలన్న చట్టం రాజ్యాంగపరమైన చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన కేసుపై తుదితీర్పును సుప్రీం కోర్టు బుధవారం రిజర్వ్‌లో ఉంచింది. చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌లు ఆర్‌ఎఫ్ నారిమన్, ఏఎం కన్విల్కర్, డివై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాలతో కూడిన ఐదుగురి సభ్యుల విస్తృత ధర్మాసనం కేసును విచారించింది. దీనిపై కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ తన తుది వాదనలు ముగించిన తర్వాత దీనికి సంబంధించిన తీర్పును ఇస్తామని జస్టిస్ దీపక్‌మిశ్రా తెలిపారు. అంతకుముందు ఏఎస్‌జి తన వాదనలు వినిపిస్తూ మన సమాజంలో పెళ్లికి ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని రంకు, వ్యభిచార కార్యక్రమాలు సాగించే భాగస్వామికి శిక్ష విధించాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశీన్యాయ స్థానాల తీర్పును పక్కన బెట్టి ఈ కార్యకలాపాలకు పాల్పడే చర్యను శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కోరారు. అంతేకాకుండా సామాజిక పరిస్థితులను ఈ నేరంలో లెక్కలోకి తీసుకోరాదని అన్నారు. అయితే వివాహ పవిత్రతను కాపాడాల్సిన అవసరం కేవలం పురుషులకే ఉందా, స్ర్తిలకు లేదా అని బెంచి ప్రశ్నించింది. సెక్షన్ ఐపీసీ 497 చట్టం ఒక వ్యక్తి అవతలి వ్యక్తి అనుమతి లేకుండా అతని భార్యతో లైంగిక చర్యలో పాల్గొంటే దానిని అత్యాచారం కింద పరిగణించరాదని చెబుతోంది. దానిని కేవలం అక్రమ సంబంధంగానే పరిగణిస్తూ వస్తోంది. అయితే దానిని నేరపూరిత చర్యగా, శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని జనవరి ఐదున వేసిన పిటిషన్‌పై ఐదుగురు జడ్జిల ధర్మాసనం విచారించింది. అయితే ఇలాంటి చట్టం ఏర్పాటులో లింగ వివక్షకు తావు ఉండరాదనే అంశాన్ని ధర్మాసనం పరిశీలిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.