జాతీయ వార్తలు

రాఫెల్‌పై చర్చకు సిద్ధమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీదర్ (కర్నాటక), ఆగస్టు 13: రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సవాల్ విసిరారు. ఈ డీల్‌పై ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ జాతి ప్రయోజనాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆరోపించారు. ఈ అంశంపై తాను నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు ఎన్ని గంటలైనా సిద్ధమేనని, అయితే తన ప్రశ్నలకు ఆయన ఒక్క సెకన్ కూడా సమాధానం ఇవ్వలేరని చెప్పారు. దక్షిణ కర్నాటక ప్రాంతంలో ‘జనధ్వని’ పేరుతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలు చెల్లిస్తున్న పన్నుల మొత్తాన్ని రాఫెల్ కాంట్రాక్టును చేజిక్కించుకున్న అతని ‘మిత్రుని’ కంపెనీకి ధారపోస్తున్నారని ఆరోపించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకాలు జరగడానికి పది రోజుల ముందే అంబానీకి చెందిన కంపెనీని స్థాపించారని ఆరోపించారు. ఇది వేల కోట్ల కుంభకోణమని ఆయన ఆరోపించారు. ఇలావుండగా తాము రక్షణ శాఖ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి ఎలాంటి కాంట్రాక్టు పొందలేదని అంబానీ గ్రూప్ నిన్న ప్రకటించిన నేపథ్యంలో రాహల్ ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ డీల్‌లో ఎంతో అనుభవమున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఏఎల్ కంపెనీని మోదీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 36 ఫైటర్ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం కుదిరిందని రాహుల్ చెప్పారు. ఈ విమానాల తయారీలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను భాగస్వామిని చేశామన్నారు. దీనివల్ల కర్నాటకలో వేలాదిమందికి ఉపాధి లభిస్తుందన్న యోచనతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. అయితే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రాన్స్‌వెళ్లి కాంట్రాక్టులోని నిబంధనలన్నీ తనకు అనుకూలంగా మార్చివేశారని ఆరోపించారు. ‘యువకుల్లారా మీ ఉద్యోగాలను మోదీ ఎత్తుకుపోయారు, మోదీకి కనుక దమ్ము ఉంటే ఆయనను నా ముందుకు రమ్మనండి, దేశం ముందు నిలబడమనండి, ఆయన ఈ విషయంలో ఎందుకు వౌనంగా ఉన్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఎందుకు ధైర్యంగా నా కళ్లల్లోకి చూడలేకపోతున్నారు?’ అని రాహుల్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. 26వేల రాఫెల్ విమానాలను 56వేల కోట్లతో కొనుగోలుకు ఒప్పందం జరిగిందని ఆయన చెప్పారు. అయితే ఈ విమానాల కొత్త ధరలను వెల్లడించరాదని ఫ్రాన్స్‌తో జరిగిన ఒప్పందంలో క్లాజ్ ఉందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బహిరంగంగా అబద్ధం చెప్పారని ఆరోపించారు. తాను ఆ దేశ ప్రధానిని కలిసి అడిగినప్పుడు అలాంటి క్లాజ్ ఏమీ లేదని తనకు స్పష్టం చేశారని రాహుల్ చెప్పారు. ‘మోదీ దేశానికి ప్రధాని కాదు.. అయితే దేశంలోని 15 మంది అత్యంత సంపన్నపరులకు మాత్రమే ఆయన ప్రధాని’ అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలను ఆయన ప్రస్తావిస్తూ మోదీ ఒక పక్క ‘బేటీ బచావో, బేటీ పడావో’ అని నినాదాలు ఇస్తుంటారని, అయితే ఆ బాలికలను ఎవరు రక్షిస్తారో మాత్రం చెప్పరని విమర్శించారు.