జాతీయ వార్తలు

గొప్ప నేతను కోల్పోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 17: ఆటల్ బిహారీ వాజపేయి మరణంతో దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబునాయుడు శుక్రవారం తెల్లవారు జామున ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చి కృష్ణమీనన్ మార్గ్‌లోని వాజపేయి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం పెట్టి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న పలు సంస్కరణలకు వాజపేయి ఆద్యుడని చంద్రబాబు ప్రశంసించారు. తప్పును తప్పుగా స్వీకరించి సరిదిద్దుకునే నైతిక విలువలుగల నాయకుడుగా వాజపేయిని అభివర్ణించారు. వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నానని, పలు అంశాల్లో తాము కలిసి పని చేశామని ఆయన గుర్తుచేసుకున్నారు. టెలికమ్యూనికేషన్లు, హై వేలు, సూక్ష్మ నీటిపారుదల, గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓపెన్ స్కై విధానం, వౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో వాజపేయి పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేశారని, గోల్డన్ క్వాడ్రాంగుల్ రహదారి పథకాన్ని అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చంద్రబాబు అన్నారు. వాజపేయి అమలు చేసిన సంస్కరణలు దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాజపేయి ఎంతో సహకరించారని చంద్రబాబు చెప్పారు. ప్రధాన మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంటేరియన్‌గా వాజపేయి వ్యవహరించిన తీరు భావి తరాలకు, రాజకీయ నాయకులకు ఆదర్శమని కొనియాడారారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.