జాతీయ వార్తలు

రాజీవ్ హత్య కేసు విచారణకు సుప్రీం అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సీబీఐ చేపట్టిన విస్తృత కోణంలో దర్యాప్తుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాజీవ్ హత్య వెనక కుట్రకోణంపై 1998లో అప్పటి కేంద్రప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను వచ్చే అక్టోబర్ నెలలో విచారిస్తామని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది. 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీనీ ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు తమిళనాడు శ్రీపెరంబదూర్‌లో ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసిన విషయం విదితమే. ఈ హత్యపై ఏంసీ జైన్ కమిషన్ విచారించి సీబీఐ ఆధ్వర్యంలో విస్తృత కోణంలో అనేక అంశాలు, సంశయాల నివృత్తి కోసం దర్యాప్తు చేయించాలని సిఫార్సు చేసింది. ఇందులో రా, ఇంటెలిజెన్స్, ఐబీ అధికారులు ఉండాలని జైన్ కమిషన్ కోరింది. ఈ సిఫార్సులకు లోబడి కేంద్రం 1998లో ఎండీఎంఏను ఏర్పాటు చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో తనకు జీవిత శిక్షను విధించాలని, ఈ శిక్ష నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గతంలోనే పెరారివాలన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సీబీఐ నేతృత్వంలోని ఎండీఎంఏ మాత్రం దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది.
ఈకేసులో శ్రీలంకకు చెందిన కొంత మంది అధికారులను విచారించాల్సి ఉందని ఎండీఎంఏ అధికారులు కోర్టుకు తెలిపారు. ఎండీఎంఏ దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందు వల్ల తనకు విధించిన జీవిత ఖైదును సస్పెండ్ చేయాలన్న పెరరారివాలన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 14వ తేదీన డిస్మిస్ చేసింది. 1999లో పెరారివాలన్‌కు జీవిత ఖైదు శిక్షను విధించారు. కాగా ఈ కేసులో దర్యాప్తు పురోగతిని వివరిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు సీబీఐను ఆదేశించింది. కాగా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఈ కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న ఏడుగురు వ్యక్తులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం వ్యతిరేకించింది.