జాతీయ వార్తలు

సంస్కరణలకు ఆద్యుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో అనేకానేక సంస్కరణలకు, సరికొత్త రాజకీయ ఒరవడికి ఆద్యుడిగా దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయిని పేర్కోవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆయన ఎన్నో రకాలుగా తోడ్పడ్డారు. ఎవరూ ఊహించని విధంగా శాస్తవ్రేత్త అబ్దుల్ కలాంను రాష్టప్రతిగా ఎంచుకున్న ఘనత ఆయనది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు, అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్ సిటీని ప్రారంభించటంతో పాటు జాతీయ క్రీడలకు కూడా వాజపేయి ప్రారంభోత్సవం చేశారు. వాస్తవానికి రాష్టప్రతి పదవికి ఆయన అలెగ్జాండర్ పేరు పరిశీలించారు. అయితే, చంద్రబాబు నాయుడు అబ్దుల్ కలాం పేరు సూచించారు. తన పంతం నెగ్గాలనే పట్టుదలకు పోకుండా, వాజపేయి మరోసారి ఆలోచించి అబ్దుల్ కలాంను రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఒక రకంగా ఈ చర్య దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అబ్దుల్ కలాం పేరును రాష్టప్రతి అభ్యర్థిగా ఖరారు చేసిన అనంతరం చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి, ఈ విషయాన్ని తెలపడం ఆయన ఉదాత్త వైఖరికి నిదర్శనం. అప్పటి తమ అనుబంధాన్ని చంద్రబాబు శుక్రవారం ఇక్కడ విలేఖరులతో పంచుకున్నారు. ‘వాజపేయి స్వయంగా నాకు ఫోన్ చేశారు. మీకిప్పుడు సంతోషమేనా అని అడిగారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన ఔచిత్యాన్ని చాటుకున్నారు’ అని చంద్రబాబు అన్నారు. వాజపేయి ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేసే వారన్నది విపక్షాలకు చెందిన నాయకులు సైతం అంగీకరించే వాస్తవం. దేశం కోసం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఎంత మాత్రం వెనకాడేవారు కారు. అధికారంలో కొనసాగినా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు ఆయనే సాటి. హైదరాబాదు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు సేకరించిన తరువాతు రక్షణ శాఖ లాబ్స్ పేరుతో కేంద్రం అభ్యంతరం తెలిపింది. అయితే, వాజపేయి స్వయంగా జోక్యం చేసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారు. నదుల అనుసంధానం విషయంలో కూడా వాజపేయి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అవి వాస్తవ రూపం దాల్చివుంటే, దేశ పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండేది.
మలేషియా రోడ్ల గురించి చంద్రబాబు వివరించినప్పుడు వాజపేయి సానుకూలంగా స్పందించారు. జాతీయ రహదారుల విధానాన్ని సవరించి గోల్డన్ కాడ్రిలేటర్ రోడ్ పథకం చేపట్టారు. సూక్ష్మ సేద్యంపై చంద్రబాబు అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. దేశాభివృద్ధికి రాజకీయాలతోగానీ, వ్యక్తులతోగానీ సంబంధం లేదని నిరూపించారు. కాంగ్రేసేతర ప్రధాన మంత్రిగా ఐదు సంవత్సరాల పాలనను పూర్తి చేసిన తొలి వ్యక్తిగా వాజపేయి పేరు భారత రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. పదమూడు నెలల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఓటు మూలంగా పదవి పోయినా బాధపడక, తన సిద్ధాంతలకే కట్టుబడిన వాజపేయిని గురించి ఎంత చెప్పినా తక్కువే. భాషలో ఉండే విశేషణాలు ఏవీ ఆయన ఘనతను కీర్తించడానికి సరిపోవు.