జాతీయ వార్తలు

ఆర్తనాదాలు...సాయం కోసం మిద్దెలెక్కి అరుపులు, కేకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాలడిలో శంకరాచార్య వర్శిటీ నుంచి 600 మంది విద్యార్థులను కాపాడిన సహాయక బృందాలు
తిరువనంతపురం, ఆగస్టు 18: ప్రకృతి అందాలకు నిలయమైన కేరళలో ఎక్కడ చూసినా ఆహారం కోసం బాధితుల హాహాకారాలు, తమను రక్షించమని కోరుతూ మిద్దెలు ఎక్కి అరుపులు వినపడుతున్నాయి. చాలా చోట్ల విసిరివేసినట్లు ఉండే బహుళ అంతస్తుల భవనాలపై గుంపులు గుంపులుగా చేరిన ప్రజలు హెలికాప్టర్ల నుంచి జారవిడిచే ఆహార పొట్లాల కోసం ఎదురుచూపులతో కూడిన దృశ్యాలు సాధారణమయ్యాయి. ఈ ఏడాది ఇంతవరకు వర్షాలు, వరదల ధాటికి కేరళ విలవిలలాడుతోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగి మిద్దెలపైన ఉన్న వారిని రక్షిస్తోంది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత వారం రోజుల్లో వరదల తాకిడికి 194 మంది మరణించారు. జల విధ్వంసానికి వృద్ధులు, మహిళలు, పిల్లలు విలవిలలాడుతున్నారు. బయటకు పోవాలంటే చుట్టూ నీరు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాతావరణం బేజారుగా తయారైంది. పడవ కనపడితే చాలు ప్రజలు ఎక్కేస్తున్నారు. పతనంతిట్టా, చెంగనూరులో వేలాది మంది ప్రజలు సాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా చోట్ల జనానికి సాయం అందక సతమతమవుతున్నరు. ఎర్నాకుళం జిల్లాలోనే 54 వేల మందిని ఇంతవరకు రక్షించి సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ జిల్లాలో పరవూర్, అలువ తాలూకాల్లో అయితే వరదలు బీభత్సం సృష్టించాయి. కొచికి సమీపంలో జగద్గురు శంకరాచార్య జన్మస్థలం కాలడిలోని శ్రీ శంకరాచార్య విశ్వవిద్యాలయం భవనాలపైన ఆరువందల మంది విద్యార్థులు చిక్కుకున్నారు. రెండు రోజుల పాటు విద్యార్థులు నరకం చూశారు. వీరిని శనివారం కొచిలోని నావికాదళ స్థావరానికి చేర్చారు. బాధితులను రక్షించేందుకు ప్రైవేట్ పడవలు, బస్సులను కూడా రంగంలోకి దించారు. నెల్లియంపతిలో వంతెన కూలింది. దీంతో బాహ్యప్రపంచంతో పాలక్కడ్ జిల్లా వాసులకు సంబంధాలు తెగిపోయాయి. చాలా చోట్ల యువకులు రంగంలోకి దిగి మహిళలు, వృద్ధులను పడవల్లో ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదుక్కిలో కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. పండనాడ్, అర్నములా, నెన్మర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నట్లు సమాచారం అందిందని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. వరద ప్రాంతాల్లో ఇండ్లన్నీ మట్టి, బురదతో నిండిపోయాయి. ఖరీదైన ఫర్నీచర్ కొట్టుకుపోయింది. చాలా ఇండ్లలో సామానులు దేనికి పనికిరాకుండా పోయాయి.
ఆగస్టు 20వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సహాయ చర్యలను మమ్మురం చేశాయి. మున్నార్, పీర్మెడ్ ప్రాంతాల్లో పది సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వర్షాల వల్ల ఇంతవరకు 359 మంది మరణించారని ప్రభుత్వం పేర్కొంది. 40 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వెయ్యి ఇండ్లు కూలిపోయాయి. 134 వంతెనలు కొట్టుకుపోయాయి. 16వేల కి.మీ పొడువున రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఇంతవరకు రూ.21వేల కోట్ల నష్టం వాటిల్లింది.