జాతీయ వార్తలు

కేసీఆర్ చర్చించలేదు : రావత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: మధ్యప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని, ఇవి నవంబర్‌లో ఉండవచ్చని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఓపీ రావత్ ఖండించారు. తాను ఇది వరకే అందరితో మాట్లాడి, షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నానని కేసీఆర్ చెప్పిన మాటను ఆయన తోసిపుచ్చారు. నిజానికి కేసీఆర్ తనతో మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రి ఇలా ప్రకటించటం దురదృష్టకరం, విచారకరమని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మినహా మరెవ్వరు కూడా శాసన సభల ఎన్నికల గురించి మాట్లాడకూడదని రావత్ తేల్చిచెప్పారు. ఎన్నికల నిర్వహణ అనేది అక్కడి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంసిద్ధతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ శాసన సభ ఎన్నికలను నాలుగు రాష్ట్రాల ఎన్నికల కంటే ముందే నిర్వహించవచ్చు, వాటితో పాటు జరపవచ్చు లేదా ఆ తరువాత నిర్వహించవచ్చునని రావత్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతపై ఎన్నికల షెడ్యూలు నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు. రాజ్యాంగం ఎన్నికల షెడ్యూలు ప్రకటించి, నిర్వహించే అధికారాన్ని కేవలం సీఈసీకి మాత్రమే ఇచ్చింది, ఇతరులెవ్వరు దీనిలో జోక్యం చేసుకోరాదని రావత్ స్పష్టం చేశారు. ఎన్నికలతో సంబంధం ఉన్న వారిని కలుసుకోవటం, మాట్లాడటం తమ బాధ్యతని అన్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మ, ఇతర అధికారులను కలుసుకున్నామని ఆయన వివరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఊహాజనిత అంశాలు, పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్య చేయదని రావత్ అన్నారు. ఇప్పుడు శాసన సభ రద్దైంది కాబట్టి మొత్తం పరిస్థితిని అంచనా వేసి, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. శాసన సభ ఎన్నికలు నవంబర్‌లో జరుగుతాయంటూ కేసీఆర్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ, ముఖ్యమంత్రి లేదా మరెవరూరు ఎన్నికల తేదీల గురించి ఎలాంటి ప్రకటన చేయకూడదని అన్నారు. తెలంగాణ ఎన్నికలు షెడ్యూలు ఎప్పుడు సిద్దమైతే అప్పుడు మీడియా ముందు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రద్దైన శాసన సభ ఎన్నిక నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ రాష్టప్రతి సూచనపై సుప్రీం కోర్టు 2002లో ఇచ్చిన తీర్పు, ఎన్నికల ప్రక్రియను ఆరు నెలల గడువులోగా ముగించటం, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల తదితర అంశాల ప్రాతిపదికపై తెలంగాణ శాసన సభ ఎన్నికల తేదీలు ఖరారవుతాయన్నారు. తెలంగాణ శాసన సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని, పలు అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాతే షెడ్యూలు తయారు చేస్తామని ఎన్నికల కమిషన్ చీఫ్ రావత్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఏడు మండలాల గురించి మాట్లాడుతూ దీని గురించి కేంద్ర హోం శాఖతో చర్చించామని, డీనోటిఫికేషన్ త్వరలోనే జరగవచ్చునని ఆయన తెలిపారు. 2018లోనే ఎన్నికలు నిర్వహించవలసి వస్తే ఈ సంవత్సరం జనవరిలో సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను ఉపయోగించుకుంటామని తెలిపారు. ఎన్నికలు 2019 జనవరిలో జరిగే పక్షంలో కొత్త సంవత్సరం జనవరిలో తయారు చేసే ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరుగుతాయని రావత్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ రద్దుకు సంబంధించిన సమాచారం తమకు గురువారం రాత్రి అందిందని, ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై ఢిల్లీకి రావాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరామని అన్నారు. ఆయనతో చర్చించిన తరువాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని రావత్ తెలిపారు.