జాతీయ వార్తలు

విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులు మానసిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారని, కనీస వసతులు లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యవహారిస్తున్నాయని న్యాయవాది శ్రవణ్‌కుమార్ ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. గతంలో దీనిపై నివేదిక సమర్పించాలని రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెలలో నివేదిక సమర్పించింది. కాని తెలంగాణ సమర్పించకపోవడంతో మరో ఏనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.