జాతీయ వార్తలు

దేశ ఐక్యతకు చిహ్నం ‘హిందీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: హిందీ భాష దేశ ఐక్యతకు చిహ్నంగా ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అభివర్ణించారు. సామాజిక, రాజకీయ, భాషాశాస్త్రాన్ని సమ్మిళితం చేస్తూ ఐక్యతను చాటిచెబుతోందని శుక్రవారం ఇక్కడ హిందీ దివస్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో హిందీ భాష కీలక భూమిక పోషించిందని ఆయన చెప్పారు. స్వాంతత్య్ర సమరయోధులకు సమాచారం వారధిగా హిందీ ఉపయోగపడిందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీయేనని, ఎక్కువ మంది అర్థం చేసుకునే భాష అదేనని ఆయన అన్నారు.‘సామాజిక, రాజకీయ, మతం, భాషాశాస్త్రాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఐక్యతకు చిహ్నంగా మారింది’అని వెంకయ్య వెల్లడించారు. ప్రాంతీయ భాషల్లోకి హిందీ రచనలను అనువదించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర భారతీయ భాషలకంటే హిందీ ఉన్నతమైందని ఆయన ఉద్ఘాటించారు. భారతీయ భాషలకు సంస్కృతం తల్లిభాష అని ఆయన తెలిపారు. దేశంలోని భాషలన్నీ అందులోంచి పుట్టినవేనని ఉపరాష్టప్రతి చెప్పారు.‘హిందీ అందరికీ సులువుగా అర్థమయ్యే భాష. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుచేయడంలో హిందీనే కీలక పాత్ర పోషిస్తోంది’అని వెంకయ్య పేర్కొన్నారు.
హిందీ దివస్ సందర్భంగా హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి సందేశం ఇచ్చారు.‘్భష అన్నది భావస్వేచ్ఛేకాదు. సాంస్కృతిక వారసత్వం అలాగే జాతికి గర్వకారణం’అని అన్నారు. దేశ సమైక్యతకు హిందీ దోహదపడుతోందని ఆయనో సందేశంలో పేర్కొన్నారు.