జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లోకి బండ్ల గణేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: సినీ నిర్మాత బండ్ల గణేశ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో శుక్రవారం ఇక్కడ కాంగ్రెస్ కండువాకప్పుకున్నారు. వీరిద్దరితోపాటు టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. అనంతరం బండ్ల గణేశ్ విలేఖరులతో మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది చేస్తానని, ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.
‘మీకు ఇష్టమైన పవన్ కల్యాణ్ పెట్టిన జనసేనలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు’ అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆనందంగా, గర్వంగా ఉందని గణేశ్ అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారా?అని అడిగితే ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. పార్టీ టిక్కెట్ అంశం రాహుల్ గాంధీతో చర్చించలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం మేరకే నడుచుకుంటానని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయడానికే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌పై తనకు ఎంతో అభిమానం ఉందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.