జాతీయ వార్తలు

సానుభూతి కోసం బాబు తంటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ప్రజల్లో సానుభూతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావువిమర్శించారు. బాబ్లీ ఆందోళనకు సంబంధించి మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే దాన్నీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో జీవీఎల్ విలేఖరులతో మాట్లాడుతూ 2010లో రాజకీయ ప్రయోజనం కోసం ఓ పోరాటం పేరుతో అప్పట్లో డ్రామాలు ఆడారని దుయ్యబట్టారు. దాన్ని పసిగట్టిన పోలీసులు బాబు, ఆయన పార్టీ నేతలపై దురుసుగా ప్రవర్తించారని గుర్తుచేశారు. ఓటుకు నోటు కేసులో కూడా పెద్దగా పురోగతి ఇప్పటికి లేదని, ఎందుకు పురోగతి లేదో ప్రజలకు తెలుసని బీజేపీ నేత అన్నారు. ఇలాంటి డ్రామా రాజకీయాలు చేయడం చంద్రబాబుకి కొత్తేమీ కాదని ఆయన తెలిపారు. బాబ్లీ ఆందోళనకు ఎన్‌బీడబ్ల్యూ వస్తే దాన్ని ఆసరా చేసుకుని సానుభూతి పొందాలని టీడీపీ ప్రయత్నిస్తోందని జీవీఎల్ ఆరోపించారు. కోర్టుల నుంచి నోటీసులు వచ్చినంత మాత్రాన వాటిని చూసి భయపడేరకం చంద్రబాబు కాదని ఆయన పేర్కొన్నారు. వారెంట్‌నూ పబ్లిసిటీ కోసం ప్రయాత్నిస్తారని బాబుపై విరుచుకుపడ్డారు. ఈ వివాదంలో కోర్టు 22 నోటీసులు ఇచ్చిందని, ఎంతకూ స్పందనలేకపోవడంతో కోర్టు నుంచి ఎన్‌బీడబ్ల్యూ వచ్చిందని నరసింహరావు ధ్వజమెత్తారు. పీడీ ఖాతాలపై సీబీఐ విచారణ జరపాలని కోరామని ఇప్పటి వరకూ టీడీపీ ప్రభుత్వం ముందుకు రాలేదని బీజేపీ ప్రతినిధి వెల్లడించారు. వారం ముందు నుంచే నోటీసులు వస్తాయని ప్రచారం చేసుకున్నారని, టీడీపీ ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు. హీరో శివాజీ తెలుగుదేశం పార్టీ కోసం ‘ఆపరేషన్ ప్యాకేజీ’తో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.