జాతీయ వార్తలు

ప్రేమోన్మాది ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, సెప్టెంబర్ 15: తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో ఒక యువకుడు 24 ఏళ్ల యువతిని దారుణంగా హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం..సుప్రియా జైన్ అనే యువతి ఒక ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. గురువారం రాత్రి సమీపంలోని ఆసుపత్రికి వెళ్తుండగా, హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తున్న కమలేష్ సాహు (24) అనే యువకుడు ఆమెను గమనించాడు. వీరిద్దరూ గతంలో దామోహ్ జిల్లాలోని నవోదయ పాఠశాలలో కలసి చదువుకున్నారు. గత కొద్దిరోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని కమలేష్ ఆమెను డిమాండ్ చేస్తుండగా ఆమె తిరస్కరిస్తూ వస్తోంది. తన ప్రేమను నిరాకరించడమే కాకుండా కొంతమంది వ్యక్తులతో చనువుగా ఉంటోందన్న కసితో కక్ష పెంచుకున్న కమలేష్ ఆమెను హతమార్చాలని ఒక నిర్ణయానికి వచ్చి శుక్రవారం రాత్రి ఆమె విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన వెంటనే కొడవలితో దాడి చేసి హతమార్చాడు. ప్రేమ విషయమై ఆమెతో వాగ్వాదానికి దిగిన కమలేష్ సాహు గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.