జాతీయ వార్తలు

కొత్త చట్టాలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎన్నికల్లో నల్లధనం నిర్మూలనకు ఈ చట్టాలు సరిపోవు *ఎన్నికల సంస్కరణలు తేవాలి
* నకిలీ, పెయిడ్ న్యూస్‌ను అరికట్టాలి * చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఎన్నికల్లో నల్లధనం నిర్మూలనకు ఇప్పుడున్న చట్టాలను సరిపోవని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ అన్నారు. భారత్‌లో ఎన్నికలు సవాళ్లు, ప్రజాస్వామ్యం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం అంటే మనకు ఇష్టానికి లోనై నడవదన్నారు. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే చిత్తశుద్ధి, అంకితభావం, సచ్ఛీలత, విజ్ఞానం, సమైక్యత, సమగ్ర భావనలు ఉండాలన్నారు. కాని ఈ ఉత్తమ సంప్రదాయాలు, లక్షణాలు ఈ రోజుల్లో అడుగంటుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం వర్థిల్లేందుకు మంచి వాతావరణం ఉండాలని, దురదృష్టవశాత్తు ఆ పరిస్థితులు లేవన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల చట్టాల్లో మార్పులు, సంస్కరణలు తేవాల్సిన అవసరం వచ్చిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య ధోరణులను చూస్తుంటే సామాన్యమానవుడికి సందేహాలు వస్తాయన్నారు. తప్పుడు వార్తలు, మోసపూరిత కథనాల వల్ల ప్రజాస్వామ్యం మసకబారుతుందన్నారు. దేశంలో మంచి పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు అన్ని వ్యవస్థలు పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. ప్రతి ప్రజాస్వామ్య దేశం మాదిరిగానే భారత్ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. సైబర్ సెక్యూరిటీ, డాటాభద్రత తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఎన్నికల జాబితా తయారు చేసే ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నికలయ్యేంత వరకు ప్రతి దశలో ఏదో రూపంలో నల్లధనం చలామణికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నిరోధించేందుకు కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. నల్లధనాన్ని నిరోధించేందుకు ఇప్పుడున్న చట్టాలు సరిపోవని, కొత్త చట్టాలు కావాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు ప్రభుత్వమే నిధులను సమకూర్చే పద్ధతి సాధ్యం కాదన్నారు. మన దేశంలో ధనాన్ని అక్రమంగా వినియోగించే ధోరణి ఎక్కువన్నారు. ఎన్నికల వ్యవస్థల్లో జవాబుదారీతనం,పారదర్శకత తేవాలన్నారు. మీడియాలో నకిలీ వార్తలు, పెయిడ్ న్యూస్‌ను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా ఈ విభాగంలో మంచి మార్పులు తెచ్చే విషయమై ఎన్నికల సంఘం తన ప్రయత్నం చేస్తుందన్నారు. మీడియా, సామాజిక మాధ్యమంలో మార్పులు శరవేగంగా వస్తున్నాయని, అనారోగ్యకరమైన సమాచారం వల్ల ప్రతికూల ప్రభావంపడుతోందన్నారు. నకిలీ వార్తలు, పెయిడ్ వార్తల వల్ల కూడా ఎన్నికల వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందన్నారు. అంతర్జాతీయ మీడియా సహకారంతో, మన దేశ మీడియా మంచి మార్పులకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల జాబితాను రూపొందించడం గొప్ప బాధ్యతన్నారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేకుండా ఉండాలని ఆయన అన్నారు.