జాతీయ వార్తలు

దేశ వ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఎఐ) పరిశీలిస్తోంది. 53 నగరాల్లో రూ.300 నుంచి రూ.400 కోట్లతో ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలో ఆధార్ సేవా కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఈ ఆధార్ కేంద్రాల్లో పేర్ల నమోదు, మార్పులు , చేర్పులు చేస్తారు. ప్రస్తుతం బ్యాంకులు, పోస్ట్ఫాసులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలతో కలిపి 30 వేల సెంటర్ల ద్వారా ఆధార్ కార్డు సేవలను అందిస్తున్నారు. ప్రజలకు విస్తృతమైన, మెరుగైనసేవలు అందించేందుకు వీలుగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకున్న వారికి ఈ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తారు. ప్రతి మెట్రో నగరంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇతర నగరాల్లో రెండేసి చొప్పున నెలకొల్పుతారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఆధార్ కార్డు సేవా కేంద్రాల ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రతి రోజు దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డుకు రాజ్యాంగ బద్ధతను కల్పిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం విదితమే. ఆధార్ కార్డు వ్యక్తిగత గోప్యత హక్కు హరించి వేస్తుందన్న అపోహల్లో నిజం లేదని కూడా కోర్టు తీర్పులో స్పష్టత ఇచ్చింది. ఐటీ రిటర్న్స్, పాన్‌కార్డుకు, సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ కార్డు నంబర్‌ను అనుసంధానం చేయడాన్నికోర్టు తీర్పులో సమర్థించారు. కాగా తాజాగా ఆధార్ కార్డు సేవా కేంద్రాల ఏర్పాటు వల్ల ప్రజలకు ఈ కార్డుకు సంబంధించి నాణ్యమైన సేవలు అందించవచ్చని ఆ సంస్థ అధికారులు చెప్పారు. ప్రజలకు అందుబాటులో నిరంతరం సేవలు అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు.