జాతీయ వార్తలు

అక్బరే స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహిళలకు లైంగిక వేధింపులపై న్యాయం కోసం పోరాడే హక్కు ఉంటుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. కేంద్రమంత్రి ఎంజె అక్బర్‌పై వచ్చిన అరోపణలకు సంబంధించి ఆ మంత్రినే స్పందించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. దేశ వ్యాప్తంగా తమపైన గతంలో పెద్ద మనుషుల ముసుగులో అనేక మంది సెలబ్రిటీలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మీటూ పేరిట ప్రచారం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎడిటర్‌గా ఎంజె అక్బర్‌గా పనిచేస్తున్న సమయంలో తమను లైంగికంగా వేధించారని కొంత మంది మహిళా జర్నలిస్టులు ఆరోపణలు గుప్పించారు. ఈ విషయమై స్మృతి ఇరానీ మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రినే మాట్లాడితే బాగుంటుందని విలేఖర్లకు చెప్పారు. ఎంజే అక్బర్ రాజీనామా చేయాలని వత్తిడి పెరుగుతున్న తరుణంలో మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఘటనలు గతంలో జరిగిన సమయంలో ప్రత్యక్షంగా లేనప్పుడు ఎలా మాట్లాడుతానన్నారు. తమకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతున్న మహిళల పట్ల అవమానకరంగా వ్యవహరించరాదన్నారు. గతంలో టీవీల్లో నటిగా పనిచేసిన మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయంపై మహిళలు బహిరంగంగా వచ్చి మాట్లాడడం కష్టమన్నారు.