జాతీయ వార్తలు

విజయవాడ నుంచే నేరుగా మక్కా యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా జెడ్డా (మక్కా)కు యాత్రికులను పంపించేందుకు కేంద్ర ప్రభుత్వ అంగీకరించింది. గురువారం ఢిల్లీలో ప్రభుత్వం విప్, ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్, ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి, ఎంపీ లియాఖత్ అలీ, సెంట్రల్ కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సెంట్రల్ హజ్ కమిటీ చైర్మన్ చౌదరి మహబూబ్ అలీ ఖైసర్‌ను కలిసి విజయవాడ విమానాశ్రయానికి ఎంబరకేషన్ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మరో పదివేల మంది హజ్, ఉమ్రా యాత్ర కోసం ఏపీ నుంచి మక్కాకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్తున్నారని, 2019 నుంచి విజయవాడ నుంచే మక్కాయాత్రకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఏ షరీఫ్ కేంద్ర మంత్రిని కోరారు. అంతర్జాతీయ విమానాలు దిగడానికి గన్నవరం విమానాశ్రయం సిద్ధమైతే 2019 హజ్ యాత్రికుల్ని విజయవాడ నుంచే నేరుగా మక్కా యాత్రకు పంపిస్తామని ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ హామీ ఇచ్చినట్టు షరీష్ తెలిపారు. దీనితో విజయవాడ నుంచి నేరుగా మక్కా యాత్ర సాధ్యమవుతుందని చెప్పారు.