జాతీయ వార్తలు

నవాజ్ షరీఫ్‌కు తీవ్ర అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్లేట్‌లైట్ల సంఖ్య ప్రమాదకర స్థాయికి పడిపోవటంతో ఆయనను ఆసుపత్రికి తరలించాలని వ్యక్తిగత వైద్యుడు సూచించటంతో వెంటనే అధికారులు ఆయనను లాహోర్‌లోని నేషనల్ అకౌంటబిలిటీ కార్యాలయం నుంచి నేరుగా లాహోర్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా నావాజ్ షరీఫ్ పనామా పత్రాల కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. కాగా నవాజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి గదిని సబ్‌జైలుగా ప్రకటించి ఏర్పాట్లు చేశారు.