జాతీయ వార్తలు

తొలి ప్రధాని నెహ్రుకు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు 55వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశానికి నెహ్రు చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు శాంతివనంలో నెహ్రూ సమాధి వద్ద పలువురు ప్రముఖులు పుష్ఫగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో పాటు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు శాంతివనంలో నెహ్రూకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.