జాతీయ వార్తలు

‘నీట్’పై త్వరలోనే చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష (నీట్) 2017-18 విద్యా సంవత్సరం నుంచి అనివార్యమని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి జెపి నడ్డా మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ‘నీట్’పై త్వరలోనే చట్టాన్ని చేసి దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఈ ఏడాది మెడికల్ పీజీ ప్రవేశాలు ‘నీట్’ ద్వారానే జరుగుతాయన్నారు. ఇటీవల జరిగిన నీట్-1 పరీక్షకు 6.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని, జూలై 24న నీట్-2 పరీక్ష యథాప్రకారం జరుగుతుందని తెలిపారు. సిలబస్, ప్రాంతీయ భాషలు, నెగిటివ్ మార్కులు వంటి అంశాలపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలపడంతో నీట్‌ను ఈ ఏడాది మినహాయించి ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌ను జారీ చేశామన్నారు. రాష్టప్రతి సంతకం చేయడంతో ఈ ఆర్డినెన్స్ తక్షణమే అమలులోకి వచ్చిందన్నారు.