జాతీయ వార్తలు

‘భోపాల్’ బాధ పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంపై ఎన్‌జిఓల ఆగ్రహం
భోపాల్, నవంబర్ 30: భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ గ్యాస్ ప్రమాద బాధితుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎన్‌జిఓలు కేంద్ర ప్రభుత్వంపై సోమవారం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాద స్థలమైన యూనియన్ కార్బైడ్ కర్మాగారంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విష కాలుష్యంపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని పర్యావరణ విభాగంతో తాజాగా సర్వే జరిపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వారు ధ్వజమెత్తారు. ‘యూనియన్ కార్బైడ్ కర్మాగారం, ఆ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న విష కాలుష్యంపై సర్వే జరుపుతామని యుఎన్‌ఇపి చేసిన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’ అని భోపాల్ గ్యాస్ పీడిత్ మహిళా, పురుష్ సంఘర్ష్ మోర్చా కన్వీనర్ నవాబ్ ఖాన్ విమర్శించారు. దేశంలో ప్రతి మారుమూల ప్రదేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని మాటలు చెబుతున్న మోదీ భోపాల్‌లో పేరుకుపోయిన విష వ్యర్థాల గురించి ఎక్కడా మాట్లాడకపోడం విడ్డూరంగా ఉందని మరో ‘చిల్డ్రన్ ఎగెనెస్ట్ డౌ కార్బైడ్’ ఎన్‌జిఓ అధినేత సఫ్రీన్ ఖాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేయతలపెట్టిన ప్రతిపాదనల వలన భోపాల్ లాంటి పెను ప్రమాదాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.