జాతీయ వార్తలు

తమిళనాడుకు మళ్లీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరద ప్రాంతాల్లో పర్యటించిన
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
చెన్నై, నవంబర్ 21: గత వారం రోజులుగా తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టి, సహాయ పునరావాస కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అయితే శ్రీలంకకు ఈశాన్య దిశగా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచేరిలోనూ 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. గత వారం చెన్నైతోపాటు కాంచీపురం, తిరువల్లూర్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, వరదలకు రోడ్డు, రైలు మార్గాలు కొట్టుకుపోయి భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. త్రివిధ దళాలకు చెందిన అధికారులు, సైనికులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే మరోమారు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరికలు జారీకావడంతో తమిళనాడు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇలావుండగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం చెన్నై, కాంచీపురం జిల్లాల్లో వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. తిరువల్లూర్ జిల్లాలో ఆదివారం పర్యటిస్తారు. అనంతరం కేంద్ర నాయకత్వానికి నివేదికను అందజేస్తారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం సహాయక చర్యలకు కోటి రూపాలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు.