జాతీయ వార్తలు

ఎంపీ పదవికి సిద్ధూ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బిజెపి సీనియర్ నాయకుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన నిలిచే అవకాశం ఉందని సమాచారం. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉపరాష్టప్రతి అన్సారీ ఆమోదించారు. 2004 నుంచి 2014 వరకూ సిద్ధూ అమృతసర్ నుంచి బిజెపి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో ఆయనను తప్పించి ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి బిజెపి అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో జైట్లీ ఓటమి చెందినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రిగా తీసుకుని రాజ్యసభకు ఎంపిక చేశారు. రాజ్యసభలో నామినేటెడ్ ఎంపీగా ఉన్న సిద్ధూ చాలాకాలంగా బిజెపి అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ఆయన భార్య ప్రస్తుతం పంజాబ్‌లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆప్ తరఫున బరిలోకి దిగితే సిఎం పదవి వరిస్తుందని సిద్ధూ భావిస్తున్నట్లు భోగట్టా.