జాతీయ వార్తలు

నివాస సముదాయం ఏర్పాటుపై అభ్యంతరాలేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: దౌత్య కార్యకలాపాలతో నిత్యం రద్దీగా ఉండే సర్దార్ పటేల్ మార్గ్‌లోని 23 ఎకరాల స్థలంలో నివాస సముదాయం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై రాష్టప్రతి కార్యాలయం లేదా భద్రతా సంస్థలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటో వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ఆదేశించింది. సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టంలోని సెక్షన్ 24(1) ప్రకారం తమకు ఈ విషయంలో మినహాయింపులు ఉన్నాయని పేర్కొంటూ ఈ సమాచారాన్ని వెల్లడించేందుకు రాష్టప్రతి కార్యాలయం నిరాకరించింది. దరఖాస్తుదారుడు అడిగిన సమాచారం అవినీతి ఆరోపణలు లేదా మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించినది కాకుండా ఇతర అంశాలకు సంబంధించినదైతే ఇంటెలిజెన్స్, భద్రతా సంస్థలు దానిని వెల్లడించకుండా ఉండేందుకు సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 24(1) నిబంధనలు వీలుకల్పిస్తున్నాయి. అయితే తాను అడిగిన సమాచారం అవినీతి ఆరోపణలకు సంబంధించినదని, ఆ సమాచారానికి సెక్షన్ 24(1) వర్తించదని సామాజిక కార్యకర్త సుభాష్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో పాయింట్ నెంబర్ 4, 5 కింద అగర్వాల్ అడిగిన సమాచారం ఆర్‌టిఐ చట్టం పరిధిలోకి రాదని, కనుక ఆయన అడిగిన సమాచారాన్ని అందజేయాల్సిందేనని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్‌కె.మాథుర్ రాష్టప్రతి కార్యాలయాన్ని ఆదేశించారు.
రాష్టప్రతి కార్యాలయానికి సమీపంలో ఒక డెయిరీ ఫారంకు చెందిన 9.26 హెక్టార్ల (22.9 ఎకరాల) భూమిని నివాస ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ఎడ్వర్డ్ కెవెంటర్ (సక్సెసర్స్) ప్రైవేట్ లిమిటెడ్ (ఇకెఎస్‌పిఎల్) అనే సంస్థ ప్రభుత్వానికి రూ.1,200 కోట్ల కన్వర్షన్ చార్జీలను డిపాజిట్ చేయడంతో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం 2010లో ఆ సంస్థకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ అంశంపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. రాష్టప్రతి కార్యాలయ ఎస్టేట్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఆ భూమిని నివాస ప్రదేశంగా మారిస్తే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొంటూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే కేంద్రం అభ్యర్థనను డివిజన్ బెంచ్ తోసిపుచ్చుతూ, ఆ ప్రాంతాన్ని జనావాస ప్రాంతంగా ఉపయోగించుకునేందుకు మాస్టర్ ప్లాన్ అనుమతిస్తోందని, ఇప్పటికే అక్కడ పలు నివాస సముదాయాలు ఉన్నాయని స్పష్టం చేసింది.