జాతీయ వార్తలు

ఓం మంత్రోచ్చారణ ఐచ్ఛికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఓం సహా కొన్ని వేద మంత్రోచ్చారణ ఐచ్ఛికమే తప్ప తప్పనిసరి కాదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టం చేసింది. వచ్చే నెల 21న జరిగే యోగా దినోత్సవం రోజున ఓం సహా ఇతర వేద మంత్రోచ్ఛరణ జరగాలంటూ కేంద్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ వివరణ వెలువడింది. యోగా దినోత్సవం రోజున వివాదం సృష్టించే ఉద్దేశంతోనే మీడియా కథనాలు వెలువడ్డాయని, ఓం అన్న మంత్రం యోగాలో అంతర్భాగమైనప్పటికీ దాని ఉచ్ఛరించడమన్నది నిర్బంధం కాదని ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ కుమార్ గనేరీవాల తెలిపారు. యోగాలో పాల్గొనే వ్యక్తులు ఓం మంత్రాన్ని ఉచ్ఛరించాలంటే ఉచ్ఛరించవచ్చు లేదా వౌనంగా ఉండిపోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరి నుంచీ ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. అంతర్జాతీయ యోగాలో భాగంగా కొత్త ఆససాన్ని ప్రవేశ పెట్టి మొత్తం వ్యవధిని మరో పది నిముషాల పాటు పెంచుతామని తెలిపారు. యోగా రోజున అన్ని స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో ఓం సహా అనేక వేద మంత్రాలను చేరుస్తూ ప్రభుత్వం ఓ సర్కులర్ జారీ చేసిందన్న కథనాలు రావడంతో వివాదం చెలరేగింది.