జాతీయ వార్తలు

వెట్టి నుంచి విముక్తికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 17: వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వెట్టిచాకిరీ నిర్మూలన పథకం వచ్చి 40 ఏళ్లు అయినా దాన్ని నిర్మూలించలేక పోయామన్నారు. గడచిన 38ఏళ్లలో 18 రాష్ట్రాలలో 172 జిల్లాలలో 2లక్షల 82వేల మందిని విముక్తి కల్గించామన్నారు. కేంద్రం ప్రభుత్వం వెట్టిచాకిరి నిర్మూలన పథకం కింద రెండు కీలక నిర్ణయాలు తీసుకుందని అందులో భాగంగా పునరావాస పథకంలో గతంలో ఇచ్చే రూ.20 వేలు నుండి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం పెంచినట్లు మంత్రి తెలిపారు. అక్రమ రవాణా నుంచి రక్షించిన పిల్లలు, వెట్టిచాకిరీ చేస్తున్న స్ర్తిలు, లైంగిక దోపిడీకి గురైన స్ర్తిలు, ట్రాన్స్ జండర్స్‌కి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం పొందుతారని బండారు చెప్పారు.
వెట్టిచాకిరీ చేస్తున్న పురుషులకు లక్ష రూపాయలు సాయం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో డబ్బులు ఒక ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. ఈ ప్రత్యేక ఖాతా నియంత్రణ పూర్తిగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారని దత్తాత్రేయ తెలిపారు.