జాతీయ వార్తలు

ఆర్డినెన్స్‌పై నేడు వివరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: వైద్య, దంత వైద్య కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ తీసుకు రావడానికి గల కారణాలను వివరించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా సోమవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. ఆర్డినెన్స్ తీసుకు రావడానికి గల కారణాలను వివరించాలని రాష్టప్రతి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను అడిగిన నేపథ్యంలో నడ్డా సోమవారం మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీని కలిసి వివరణ ఇస్తారని అధికార వర్గాలు ఆదివారం ఇక్కడ చెప్పాయి. రాష్టప్రతి మంగళవారం చైనాకు బయల్దేరుతారు. నీట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నుంచి పాక్షికంగా మినహాయింపుకోసం ఉద్దేశించిన ఈ ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. అన్ని ప్రభుత్వ కళాశాలలు, డీమ్డ్ యూనివర్శిటీలు, ప్రైవేటు కళాశాలలను నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరిధిలోకి తెస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే నీట్‌ను అమలు చేయాలని కూడా ఆదేశించింది. రాష్టప్రతి ఆర్డినెన్స్‌పై నిపుణుల అభిప్రాయాలను కూడా కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీట్లను నీట్ పరిధి నుంచి మినహాయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోని రాష్ట్ర సీట్లను కూడా నీట్ నుంచి మినహాయించినట్లు చెప్పాయి. వివిధ రాష్ట్రాలు ఎక్కడయితే వివిధ ప్రైవేటు కళాశాలల్లోని 12 నుంచి 15 శాతం సీట్లను రాష్ట్ర కోటాకు కేటాయించాయో ఆ సీట్లను ఒక రాష్ట్రానికి చెందిన విద్యార్థి మరో రాష్ట్రంలోనూ పొందవచ్చు. ఇలాంటి కళాశాలల్లోని మిగిలిన సీట్లను స్థానిక విద్యార్థులకు రిజర్వు చేస్తారు. నీట్ ఆర్డినెన్స్ అధికారికంగా జారీ అయితే స్థానిక విద్యార్థులకు కేటాయించిన మిగిలిన సీట్లు నీట్ పరిధిలోకి వస్తాయి. కేంద్రం ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల సమావేశంలో 15కు పైగా రాష్ట్రాలు నీట్‌ను వ్యతిరేకించాయి. వేర్వేరు సిలబస్‌లు, వేర్వేరు మాధ్యమాలు గల విద్యార్థులు నీట్‌కు తయారవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
నీట్ రెండో దశ పరీక్ష జూలై 24న జరుగనుంది. మే 1న జరిగిన మొదటి దశ పరీక్షకు సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆర్డినెన్స్ జారీ అయితే రాష్ట్ర ప్రభుత్వాల బోర్డులకు చెందిన విద్యార్థులు జూలై 24న జరిగే నీట్ రెండో దశ పరీక్షకు హాజరు కావలసిన అవసరం ఉండదు. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారు నీట్ పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు తెలిపాయి.