జాతీయ వార్తలు

ఆర్‌ఎల్‌వీతో కొత్తపుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: వాతావరణం, గాలి అనుకూలంగా ఉంటే 11టన్నుల రాకెట్ సోమవారం శ్రీహరికోట లాంచ్‌ప్యాడ్ నుంచి దూసుకుపోనుంది. భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో తొలిసారి పునర్వినియోగ అంతరిక్ష ప్రయోగ నౌక (ఆర్‌ఎల్‌వీ)ను తొలిసారి సోమవారం ప్రయోగించ బోతున్నారు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కిరణ్‌కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పునర్వినియోగ అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలో వౌలిక సదుపాయాలకు సంబంధించి ఖర్చును గణనీయంగా తగ్గించటం భారత లక్ష్యమని అన్నారు. పునర్వినియోగ రాకెట్లు విజయవంతమైతే అంతరిక్షంలో ఖర్చు దాదాపు పది వంతులు తగ్గుతుందని వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌తో ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు...
ప్రశ్న: ఆర్ ఎల్ వీ అంటే ఏమిటి?
కిరణ్‌కుమార్: అంతరిక్ష ప్రయోగపు ఖర్చు తగ్గించేందుకు రూపొందించిన వ్యవస్థ ఇది. ఈ రకమైన టెక్నాలజీ సిరీస్‌లో ఇది మొదటి ప్రయోగం. దీన్ని మేం హెక్స్-1 అని పిలుస్తున్నాం. అంటే హైపర్ సోనిక్ ప్రయోగం. దీనికి రెక్కలు ఉంటాయి. మనం మొదటి సారి ఇలాంటి రెక్కలున్న రాకెట్‌ను తయారు చేస్తున్నాం. ఇది అంతరిక్షంలో రాకెట్‌ను వదిలి తిరిగి భూమీదకు వస్తుంది. ఇందులో శక్తిమంతమైన రాకెట్ మోటర్ ఉంటుంది. అయితే మరింత తక్కువ ఖర్చుతో ఆర్‌ఎల్‌వీని పూర్తిస్థాయి టెక్నాలజీతో తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నాం.
ప్రశ్న: అంటే ముందుగా మీరు ఆర్ ఎల్ వీ ని శ్రీహరికోట నుంచి ముందుగా ప్రయోగిస్తారు. అది తిరిగి వచ్చి బంగాళాఖాతంలో ఎక్కడో ఒకచోట కిందకు దిగుతుంది.. అంతేనా?
కిరణ్‌కుమార్: అవును. మొదటి ప్రయోగం ఇలాగే జరుగుతుంది. శ్రీహరి కోటలో లాంచ్ అయిన రాకెట్, బంగాళాఖాతంలో దిగుతుంది. అయితే మన అంతిమ లక్ష్యం ఆర్ ఎల్‌వీ శ్రీహరి కోట ద్వీపంలోనే దిగటం. ఇది త్వరలోనే సాధిస్తాం.
ప్రశ్న: ఇందుకోసం అమెరికన్ స్పేస్ షటిల్‌ల మాదిరిగా శ్రీహరి కోటలోనూ రన్‌వేను నిర్మిస్తారా?
కిరణ్‌కుమార్: అవును.. అంతిమంగా జరిగేది అదే. భవిష్యత్తులో శ్రీహరికోటలోనే మన పునర్వినియోగ అంతరిక్ష నౌకలు ల్యాండ్ అవుతాయి. ఇందుకోసం అవసరమైన ప్రయోగాలు కొనసాగుతున్నాయి.