జాతీయ వార్తలు

ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: రాష్ట్రాల బోర్డులను నీట్‌నుంచి మినహాయిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన ఆర్డినెన్స్‌కు రాష్టప్రతి ఆమోద ముద్ర పడింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఉదయం నాలుగు రోజుల చైనా పర్యటనకు బయలుదేరే ముందు నీట్ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. ఈమేరకు మెడికల్‌కు, డెంటల్‌కు వేర్వేరుగా ఆర్డినెన్స్‌లు జారీ అయ్యాయ. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అన్ని రాష్ట్రాల విద్యా బోర్డుల పరిధిలోని విద్యార్థులకు ఈ ఏడాది నీట్ పరీక్ష నుంచి మినహాయింపు లభించింది. అయితే కేంద్రం పరిధిలోని మెడికల్, ప్రవేట్ మేనేజ్‌మెంట్లు, డీమ్డ్ వర్శిటీల్లో వైద్య విద్య అభ్యసించాలంటే నీట్ పరీక్ష తప్పనిసరి అని ఆర్డినెన్స్‌లో స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన ఒక ఏడాది మినహాయింపు కేవలం రాష్ట్ర ప్రభుత్వాల బోర్డులకు మాత్రమే వర్తిస్తుంది. వచ్చే ఏడాదినుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల ప్రవేశానికి నీట్ తప్పనిసరి. ఆర్డినెన్స్ ద్వారా లభించిన మినహాయింపు 2016-17 గ్రాడ్యుయేట్ ఎంబిబిఎస్ ప్రవేశ పరీక్షలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నీట్ ఆర్డినెన్స్‌పై తనకున్న అనుమానాలు, సంశయాలను నివృత్తి చేసుకునేందుకు సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి జెపి నడ్డాను రాష్టప్రతి భవన్‌కు పిలిపించుకోవడం తెలిసిందే. ప్రణబ్ ప్రస్తావించిన పలు అంశాలకు నడ్డా సరైన సమాచారం ఇవ్వలేకపోయారు. దీంతో రాష్టప్రతి ప్రస్తావించిన పలు అంశాలకు నడ్డా గత రాత్రి లిఖిత పూర్వక సమాధానం పంపించారు. తనకు అందిన వివరాలను ప్రణబ్ పూర్తిగా పరిశీలించిన అనంతరం అర్డినెన్స్‌పై సంతకం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు రాష్టప్రతి భవన్ వర్గాలు చెప్పాయి. ప్రణబ్ ముఖర్జీ అనుకూల నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందగానే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం ఉదయం ఏడున్నరకే రాష్టప్రతి భవన్‌కు వెళ్లి రాష్టప్రతి సంతకం చేసిన ఆర్డినెన్స్ పత్రాలను తీసుకెళ్లారు.
జెపి నడ్డా వివరణ
ఆర్డినెన్స్ ద్వారా నీట్‌కు చట్టబద్ధత వచ్చిందని వైద్య ఆరోగ్య మంత్రి జెపి నడ్డా ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ ఆర్డినెన్స్‌పై రాష్టప్రతి సంతకం చేశారని, నీట్‌కు ఏడాది మినహాయింపు లభించిందన్నారు. ఇప్పటికే మొదటి విడత పూరె్తైందని, జూలై 24న రెండో విడత నీట్ పరీక్ష జరుగుతుందన్నారు. కేంద్రం మొదటి నుంచీ నీట్‌కు అనుకూలమేనని, వైద్య ఆరోగ్య శాఖే రివ్యూ పిటిషన్ వేసిందన్న విషయం మర్చిపోకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనను సుప్రీం కోర్టు ముందు పెట్టాల్సిన పద్ధతిలో పెట్టలేకపోయాయని, తరువాత కేంద్రం వద్ద పలు సమస్యలను వివరించాయన్నారు. పార్లమెంటులోనూ పలువురు సభ్యులు నీట్ మూలంగా విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారని నడ్డా వివరించారు. విద్యా శాఖ మంత్రులు అఖిలపక్ష సమావేశంలో నీట్‌కు మద్దతిస్తూనే, వివిధ కారణాల మూలంగా రాష్ట్ర బోర్డులకు ఏడాది మినహాయింపు ఇవ్వాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తరువాతే ఆర్డినెన్స్ జారీ నిర్ణయానికి వచ్చిందన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలు నీట్ పరిధిలోనే జరుగుతాయని నడ్డా వెల్లడించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు తోడ్పడేందుకే కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందనే ఆరోపణలను నడ్డా ఖండించారు.