జాతీయ వార్తలు

ఈశాన్య భారతం అష్టలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువహటి, మే 24: అసోంతోపాటు అన్ని ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి సహాయ, సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈశాన్య రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఓ పటిష్టమైన విధానాన్ని ముందుకు తెస్తుందని తెలిపారు. మొత్తం ఈశాన్య భారత సమగ్ర అభివృద్ధికి అసోం కేంద్రం కాబోతోందని, దీని ఆలంబనగానే ఈ ప్రాంతం సర్వతోముఖంగా ప్రగతి పరుగులు పెడుతుందని మోదీ తెలిపారు. అసోంలో తొలి బిజెపి ప్రభుత్వం ఆవిర్భవించిన సందర్భంగా మంగళవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కేంద్రం గట్టిగా కృషి చేస్తుందని, సమతూకంతో కూడిన అభివృద్ధిని సాకారం చేస్తుందని ఆయన అన్నారు. దేశంలోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెంది తూర్పు ప్రాంతం వెనకబడిపోతే అది సమగ్ర అభివృద్ధి కాదని ప్రధాని స్పష్టం చేశారు. అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిషా అలాగే మొత్త ఈశాన్య ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఎన్‌డిఏ కట్టుబడి ఉందన్నారు. పోటీ తత్వంతో కూడిన, సహకార సమాఖ్య వ్యవస్థపట్ల తమ ప్రభుత్వానికి ఎంతో విశ్వాసం ఉందని ఆయన వెల్లడించారు. అభివృద్ధి చెందాలనుకుంటున్న రాష్ట్రాలకు పూర్తిస్థాయి అధికారాలు తమ ప్రభుత్వం అందించిందని అలాగే బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు చేయిపట్టుకుని మరీ అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రధాని చెప్పారు. ఈశాన్య భారతాన్ని సిక్కింసహా అష్టలక్ష్మిగా ప్రధాని అభివర్ణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ వచ్చిన ప్రభుత్వాలన్నీ ఎంతోకొంత మేలు చేశాయని, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించారు. లోపాలను తొలగించుకుంటూ ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడుతూ అభివృద్ధి మార్గంలో అన్ని ప్రాంతాలూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసోంకు ఏ రకమైన లోటు రానీయమని, రాష్ట్రంలోని ఏ రకమైన ఆకాంక్షలతో పగ్గాలు చేపట్టిందో వాటన్నింటినీ ఈడేర్చేందుకు పూర్తిగా సహకరిస్తామని మోదీ చెప్పారు. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నింటికీ స్ఫూర్తిదాయకమైన రీతిలో అసోం విలువలు, సంస్కృతి, నైతికవర్తనను వెలుగులోకి తేవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

గువహటిలో మంగళవారం బిజెపి నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న నరేంద్ర మోదీ