జాతీయ వార్తలు

అసోం ముఖ్యమంత్రిగా సోనోవాల్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మే 24: ఈశాన్య రాష్ట్రం అసోంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సోమవారం పగ్గాలు చేపట్టింది. ఆ పార్టీ లెజిస్లేచర్ నాయకుడు శర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఖనపరా ఫీల్డ్స్‌లో జరిగిన భారీ బహిరంగ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాల సమక్షంలో గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, సోనోవాల్ చేత ప్రమాణం చేయించారు. మరో పది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మిత్రపక్షాలైన అసోం గణపరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్‌లకు కూడా మంత్రివర్గంలో సముచిత స్థానం లభించింది. బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించిన హిమంత బిశ్వ శర్మకు మంత్రివర్గంలో చోటు లభించింది. సోనోవాల్ అస్సామీ భాషలో ప్రమాణం చేయగా, మంత్రులు బోడో, బెంగాలీ భాషల్లో ప్రమాణం చేశారు. సోనోవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులంతా హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కారీ, సురేశ్ ప్రభు, వెంకయ్యనాయుడు, రాంవిలాస్ పాశ్వాన్, జితేంద్రసింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, బీజేపీ, దాని మిత్రపక్షాల ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధరారాజె, ఆనందిబెన్ పటల్, ఫడ్నవిస్, మనోహర్‌లాల్ ఖట్టర్, ప్రకాశ్‌సింగ్‌బాదల్, చంద్రబాబునాయుడు తదితరులు హాజరయ్యారు.
అంచెలంచెలుగా ఎదిగిన సోనోవాల్
అసోం రాజకీయాల్లో విద్యార్థి సంఘం నాయకుడిన దగ్గరనుంచి అంచెలంచెలుగా ఎదిగిన శర్బానంద్ సోనోవాల్ మంగళవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విద్యార్థిగా అస్సాం గణ పరిషత్ (ఎజిపి)లో పనిచేసిన సోనోవాల్ బిజెపిలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చిద్విలాసంగా కనిపించే 54 ఏళ్ల సోనోవాల్‌కు క్లీన్ ఇమేజ్ ఉంది. 2011లోనే బిజెపిలో చేరిన బ్రహ్మచారి శర్బానంద్‌కు కేబినెట్‌లో బెర్త్ దక్కడం అనేక మంది సీనియర్లను ఆశ్చర్యంలో పడేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీని ఏకతాటిపై నడిపి ఘనవిజయం సాధించడంలో ఆయన పోషించిన పాత్ర అనితర సాధ్యం. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు)లో చురుగ్గా పనిచేసిన సోనోవాల్ 1992 నుంచి 1999 వరకూ దాని అధ్యక్షుడిగా పనిచేశారు. న్యాయశాస్త్ర పట్ట్భద్రుడైన ఆయన నార్త్‌ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ చైర్మన్‌గా 1996 నుంచి 2000 వరకూ పనిచేశారు. 2011లో ఆసు నుంచి అస్సాం గణ పరిషత్‌లో చేరి ఎగువ అస్సాం మోరాన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన సోనోవాల్ కాంగ్రెస్ సీనియర్ నేత పబన్ సింగ్ ఘటోవర్‌పై విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనోవాల్‌ను అభినందిస్తున్న అసోం
గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య