జాతీయ వార్తలు

ఫుడ్ అథారిటీ నివేదిక రాగానే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: సామాన్యుడు మొదలుకొని సంపన్నుల దాకా అందరూ తినే ప్రముఖ బ్రాండ్ల బ్రెడ్ శాంపిల్స్‌లో క్యాన్సర్ కారక రసాయనాలున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడయిన ఒక రోజు తర్వాత ఈ అంశంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నివేదిక అందిన వెంటనే తగుచర్య తీసుకుంటామని ప్రభుత్వం తెలియజేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వీలయినంత త్వరగా నివేదిక సమర్పించాలని తాను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐని ఆదేశించినట్లు పావ్, బన్నుసహా దాదాపు 38 రకాల బ్రెడ్ ఉత్పత్తుల్లో చాలా దేశాలు నిషేధించిన పొటాసియం బ్రోమైడ్, పొటాసియం అయొడేట్‌లాంటి రసాయనాలున్నట్లు సెంటర్ ఫర్ సైన్స్, ఎన్విరాన్‌మెంట్ (సిఎస్‌ఇ) ఒక నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి క్యాన్సర్ కారకమైతే, మరోటి థైరాయిడ్ సమస్యలను సృష్టించేదని, అయితే వీటిని భారత్‌లో నిషేదించలేదని కూడా ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఆరోగ్య శాఖ ఈ వ్యవహారాన్ని చాలాతీవ్రంగా పరిగణిస్తోందని, అత్యవసరంగా దీనిపై తనకు నివేదిక అందజేయాలని అధికారులను కోరినట్లు నడ్డా సోమవారమే చెప్పారు.