జాతీయ వార్తలు

వేలిముద్రల డేటాబ్యాంక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యల్లో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన విదేశీయుల వేలిముద్రల సేకరణ భారీ డేటాబ్యాంకును సృష్టించింది. ఈ-టూరిస్టు వీసాపై దేశానికి వచ్చే ప్రతి విదేశీయుడి వేలిముద్రలను సేకరించి భద్రపరిచే వ్యవస్థను కొన్ని రోజుల క్రితం ప్రారంభించింది. విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎలక్ట్రానిక్ వీసాపై వచ్చే విదేశీయులందరి వేలిముద్రలను సేకరించటం ఇప్పటికే మొదలుపెట్టారు. ప్రతి విదేశీయుడికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కేస్ ఫైల్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు పది లక్షల యూనిక్ కేసు ఫైళ్లు తయారయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. వివిధ ఉగ్రవాద సంస్థలు, ఐసిస్ వంటి టెర్రర్ మూకల నుంచి ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం శాఖ ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ-టూరిస్టు వీసాపై వచ్చే ప్రతి విదేశీయుడి వేలిముద్రను సేకరించటంపై విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల భారత్‌కు వచ్చే టూరిస్టులను నిరాశపరిచినట్లవుతుందని.. వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని విదేశాంగశాఖ తన అభిప్రాయాన్ని హోంశాఖకు వెల్లడించింది. అయితే దేశ భద్రత దృష్ట్యా హోం శాఖ మాత్రం వేలిముద్రల డేటాబ్యాంకును సేకరించాల్సిందేనని నిర్ణయం తీసుకుంది. అయితే.. విదేశీ టూరిస్టులకు లాంగ్‌టర్మ్ వీసా జారీ చేయటం వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని విదేశాంగశాఖకు సలహా ఇచ్చింది.
భారతీయులకు పదేళ్లపాటు పర్యాటక, వ్యాపార వీసాలను అమెరికా ఇస్తున్న విషయాన్ని హోంశాఖ అధికారి గుర్తు చేశారు. 27, నవంబర్ 2014 నుంచి 150 దేశాల పర్యాటకులకు ఈ టూరిస్టు వీసా పథకాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే.