జాతీయ వార్తలు

24 నెలలు.. 21 ఆర్డినెన్స్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నీట్‌పై తాజాగా చేసిన ఆర్డినెన్స్‌తో ఈ రెండేళ్లలో ఎన్‌డిఏ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల సంఖ్య 21కు చేరింది. ఆర్డినెన్స్‌లలో అత్యంత వివాదాస్పదమైంది భూ సేకరణ బిల్లు. 2014 మేనెలలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో రెండు ఆర్డినెన్స్‌లకు సిఫార్సు చేసింది. ట్రాయ్ చట్టంలో సవరణకు సంబంధించింది మొదటిది కాగా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ముంపుగ్రామాలకు సంబంధించింది రెండోది. రెంటిపైనా 2014 మే 28 ఆర్డినెన్స్‌లు జారీ అయ్యాయి. వీటితోపాటు 2014లో ఐదు ఆర్డినెన్స్‌ను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో ఒకటి వివాదాస్పద 2013 భూ సేకరణ బిల్లుపై ఆర్డినెన్స్. పునరావాస ప్యాకేజీ, భూసేకరణలో పారదర్శకత వంటి కీలక అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి. అంతకు ముందు యుపిఏ ప్రభుత్వం బిల్లును రూపొందించింది. మూడుసార్లు బిల్లుకు ఆమోదం పొదండానికి అప్పటి ప్రభుత్వం విఫలయత్నం చేసింది. అలాగే బొగ్గు గనులపై ఆర్డినెన్స్ చేశారు. మరొకటి టెక్స్‌టైల్ అండర్‌టేటింగ్, బమీ చట్టాల సవరణకు సంబంధించినవి. కాగా 2015లో మొత్తం 10 ఆర్డినెన్స్‌లు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో ఓవర్సీస్ సిటిజన్ షిప్, మోటర్ వెహికల్ చట్ట సవరణ బిల్లులున్నాయి. ఉత్తరాఖండ్ వ్యయానికి సంబంధించి మార్చి 29న పార్లమెంట్ ప్రొరోగ్ అయిన తరవాత ఆర్డినెన్స్ జారీ అయింది. అలాగే ఉత్తరాఖండ్ ద్రవ్య వినిమయ ఆర్డినెన్స్ స్థానే ఓ బిల్లును తీసుకొచ్చారు.