జాతీయ వార్తలు

సిబిఐ విచారణకు హాజరైన రావత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, మే 24: రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపి స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌ను మంగళవారం సిబిఐ విచారించింది. మార్చి 27న ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించిన తరువాత బలపరీక్షలో తనకు అనుకూలంగా ఓటేయాలంటూ ఎమ్మెల్యేలతో రావత్ బేరసారాలు చేశారని ఆరోపణ. స్టింగ్ ఆపరేషన్ వీడియో క్లిప్పింగ్‌లు సంచలనం సృష్టించాయి. రాష్ట్ర రాజధానికి అందిన సమాచారం మేరకు సిఎం హరీశ్ రావత్ ఉదయం 12 గంటల సమయంలో ఢిల్లీ సిబిఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కేసు విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని రావత్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి సిబిఐ పలు ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. చట్టంముందు అందరూ సమానులేనని అన్నారు. తొలుత తాను అమాయకుడినని కుట్రతోనే తనపై ఇదంతా సృష్టించారని రావత్ ఆరోపించారు.

సిబిఐ కార్యాలయానికి వచ్చిన రావత్‌ను
చుట్టుముట్టిన విలేఖరులు