జాతీయ వార్తలు

ప్రతీకారం తీర్చుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, మే 24: మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో ఆదివారం ఆరుగురు అసోం రైఫిల్స్ జవాన్లను మట్టుబెట్టిన మిలిటెంట్లపై ప్రతీకారం తీర్చుకుంటామని సైన్యం మంగళవారం స్పష్టం చేసింది. ‘తీవ్రవాద నిరోధక ఆపరేషన్లలో చొరవ, అవకాశం అనేది ముఖ్యమైనవి. ఈ అవకాశం మిలిటెంట్లకు లభించింది. అయితే అతిత్వరలోనే మేము చాలా తీవ్రంగా ఎదురుదెబ్బ తీసి తీరుతాం’ అని సైన్యానికి చెందిన 3 కోర్ విభాగం అధిపతి (జిఓసి) లెఫ్టెనెంట్ జనరల్ అభయ్ కృష్ణ చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం సంఘటన జరిగిన భారత్-మయన్మార్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతానికి దగ్గర్లోని దట్టమైన అడవుల్లో మిలిటెంట్లకోసం సైన్యం పెద్దఎత్తున గాలింపు కొనసాగిస్తోంది. అయితే ఆ ఆపరేషన్ వివరాలను మీడియా ముందు వెల్లడించడానికి అభయ్ కృష్ణ నిరాకరిస్తూ, గాలింపు కొనసాగుతోందని మాత్రం చెప్పారు. ఏ ఎదురుదెబ్బ కూడా భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేవని, ఇలాంటి ప్రాణనష్టం ప్రతి ఒకరికీ ఎదురుదెబ్బేనని, అయితే ఇది తాము తిరిగి పుంజుకుని ఇంతకన్నా గట్టిదెబ్బ తీయడానికి లభించిన ఓ అవకాశం కూడానని ఆయన అన్నారు. కాగా, మిలిటెంట్ల చేతిలో చనిపోయిన ఆరుగురు జవాన్ల భౌతిక కాయాలను భారత వైమానిక దళానికి చెందిన రెండు ప్రత్యేక విమానాల్లో వారి స్వస్థలాలకు పంపించడం జరిగింది. మృతదేహాల వెంట అసోం రైఫిల్స్‌కు చెందిన ఓ బృందం కూడా వెళ్లింది.

జవాన్ల భౌతిక కాయాల వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్