జాతీయ వార్తలు

బస్సుల్లో ఇక ప్యానిక్ బటన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: దేశవ్యాప్తంగా బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపట్టబోతోంది. ఆత్యవసర ప్యానిక్ బటన్లు, సిసిటివి కెమేరాలు, జిపిఎస్ ఆధారిత ట్రాకింగ్ పరికరాలను ఇందులో భాగంగా అన్ని బస్సుల్లోనూ ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు సంబంధించి జూన్ 2న నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్టు రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారంనాడిక్కడ వెల్లడించారు. నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత, రక్షణ చర్యలు విస్తృతంగా చేపట్టాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్యానిక్ బటన్లు, సిసిటివి కెమేరాలను అమర్చిన రాజస్థాన్ రోడ్డు రవాణా బస్సుల్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. బస్సులను నిర్మిస్తున్న సమయంలోనే వాటిలో ఈ పరికరాలను అమర్చే ప్రక్రియను పరిశీలిస్తున్నామన్నారు. వీటిని భారీగా కొనడం వల్ల వాటి వ్యయభారం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రతిపాదిత నోటిఫికేషన్ ప్రకారం..23మంది ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉన్న అన్ని బస్సుల్లోనూ ప్యానిక్ బటన్ సహా అన్ని కీలక పరికరాలను అమరుస్తారు. వీటిని జిపిఎస్‌తో సంధానం చేస్తామని, స్థానిక పోలీసు కంట్రోలు రూమ్ నుంచి పర్యవేక్షణ జరుగుతుందని చెప్పారు. బస్సులో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా సదరు మహిళా ప్రయాణికురాలు ప్యానిక్ బటన్ నొక్కితే జీపిఎస్ ద్వారా స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందుతుందని గడ్కరీ తెలిపారు. అంతే కాదు, ఎమర్జెన్సీ బటన్ నొక్కిన వెంటనే బస్సులో ఉన్న సిసిటివి కెమేరాలు కూడా పని చేయడం మొదలు పెడతాయని..బస్సులో జరుగుతున్నదంతా స్థానిక పోలీసు స్టేషన్ కంట్రోల్ రూమ్‌లో కనిపిస్తుందని వెల్లడించారు. ఒక వేళ సదరు బస్సు నిర్దేశిత మార్గంలో వెళ్లక పోయినా దాని కదలికలకు సంబంధించిన సమాచారమూ కంట్రోల్ రూమ్‌కు అందుతుందని గడ్కరీ వివరించారు.