జాతీయ వార్తలు

బెంగాల్ బాండ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి తమ శాసన సభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ‘బాండు పేపర్ హామీ పత్రం’ బాటపట్టింది. ‘కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి విధేయులుగా ఉంటాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడబోం’ అంటూ వంద రూపాయల బాండు పేపర్‌పై ఎమ్మెల్యేలతో హామీపత్రం రాయించుకున్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకుంది. గతంలో కాంగ్రెస్ బలం 42. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ 44 సీట్లతో ప్రధాన ప్రతిపక్షస్థాయికి ఎదిగితే సిపిఎం మూడోస్థానానికి పడిపోయింది. ప్రధాన ప్రతిపక్షం హోదాను కాపాడుకోవాలంటే తమ శాసన సభ్యులు పార్టీ ఫిరాయించకుండా చూసుకోవాలి. భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తమ పార్టీ ఉనికిలేకుండా చేయాలని వ్యూహం పన్నుతున్నారని పసిగట్టిన కాంగ్రెస్ నేతలు బాండు రాజకీయమే శ్రీరామరక్ష అని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విధేయులుగా ఉంటామని, ఎట్టిపరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడబోమని రాయించుకున్నారు. అంతేకాకుండా పార్టీని వీడిపోవలసి వచ్చే పక్షంలో అధినాయకులను విమర్శించడంగానీ, కాంగ్రెస్ లోటుపాట్ల గురించి బహిరంగంగా చర్చించడంగానీ చేయబోమని శాసన సభ్యులతో హామీ తీసుకున్నారు. వేరే పార్టీలో చేరాలనుకునే పక్షంలో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తామంటూ పశ్చమ బెంగాల్ కాంగ్రెస్ శాసన సభ్యుల చేత హామీ పత్రం రాయించుకున్నారు. పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అధిర్‌రంజన్ చౌదరి మంగళవారం కోల్‌కత్తాలో పార్టీ కార్యాలయంలో సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ శాసన సభ్యులతో బాండు పేపర్‌పై సంతకం చేయించుకున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పట్ల విధేయత ప్రకటించుకునేందుకే ఎమ్మెల్యేలు ఈ హామీపత్రం రాసి ఇచ్చారని అధిర్ రంజన్ చౌదరి చెబుతున్నా, తృణమూల్ కాంగ్రెస్ ప్రలోభాలకు తమ సభ్యులు లొంగిపోతారేమోననే భయంతోనే కాంగ్రెస్ హైకమాండ్ వారితో హామీ పత్రాలు రాయించుకున్నదని అంటున్నారు.
అద్భుతమైన ఆలోచన
బాండు పేపర్‌పై విధేయత రాయించుకోటం అద్భుత ఆలోచన అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానస్ బునియా అభిప్రాయపడ్డారు. పార్టీ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహల్‌గాంధీకి హామీపత్రం రాయించుకోవటంతో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ ఆలోచన అని ఆయన చెబుతున్నారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో ఇదొక కొత్త ఆలోచనా విధానమని బునియా వ్యాఖ్యానించారు. శాసన సభ్యులను బానిసలుగా మార్చారన్న వాదన నిజం కాదని, తమను అసెంబ్లీకి పంపిన పార్టీ హైకమాండ్ పట్ల విధేయతను చాటుకునేందుకు ఎమ్మెల్యేలు ఈ హామీ పత్రం రాసిచ్చారని ఆయన వాదిస్తున్నారు.