జాతీయ వార్తలు

ఇష్టప్రకారమే.. ఓం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: ‘జాతి మతాలకు సంబంధం లేని విశ్వపదం ఓం. ఉదాత్తమైన ఈ పదానికి యోగాలో ఎప్పుడూ చోటుంటుంది. కాకపోతే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన నిర్వహించే యోగాసనాల్లో ఓం స్మరించాలన్న బలవంతం ఏమీ లేదు. లేదు. ఇష్టమైనవాళ్లు ఓం స్మరణ చేయొచ్చు. లేనివాళ్లు నచ్చిన మరే పదమైన స్మరించుకోవచ్చు. అది వాళ్లిష్టం’ అని ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్ స్పష్టం చేశారు. ప్రపంచ యోగా దినోత్సవాన నిర్వహించే యోగాసన కార్యక్రమాల్లో ‘ఓం’ స్మరించాలన్న అంశంపై కొన్ని మైనారిటీ వర్గాలు వ్యక్తం చేస్తున్న వ్యతిరేకతకు నాయక్ తెరదించే ప్రయత్నం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం గత ఏడాది నిర్వహించినట్టే ఈ ఏడాదీ యోగాసన క్రమం నడుస్తుంది. ఈ విషయంలో ఎలాంటి కామాలు, ఫుల్‌స్టాప్‌లూ లేవు. యోగా డేలో ఈసారీ సూర్య నమస్కారాన్ని భాగం చేయడం లేదు. కాకపోతే, యోగాసన అభ్యాస సమయాన్ని పది నిమిషాల పాటు పెంచినట్టు నాయక్ వెల్లడించారు. గత ఏడాది పూర్తిస్థాయిలో ఆసనాలు వేసేందుకు సమయం సరిపోక పోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘ఓం పదోచ్చారణ నేరమేమీ కాదు. అభ్యాసన తీరులో ఓం ఉచ్చరించటం వల్ల శరీరానికి అవసరమైనంత ప్రాణవాయువు అందుతుంది’ అని ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ భార్య సల్మా పేర్కొన్నట్టు వచ్చిన పత్రికా కథనాలను మంత్రి నాయక్ ఇక్కడ ఉటంకించారు. ‘మంచికి ఎప్పుడూ వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే, యోగా దినోత్సవాన నిర్వహించే కార్యక్రమాలకు అడ్డుతగల వద్దని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు మంచి అనిపించింది ఆరోజు ఆచరించండి, తప్పులేదు’ అని నాయక్ స్పష్టం చేశారు.
ఇక సూర్య నమస్కారంపై స్పష్టతనిస్తూ, క్లిష్టమైన 12 యోగాసనాల్లో సూర్య నమస్కారం ఒకటని, దీన్ని యోగా డేలో భాగం చేయడం లేదన్నారు. అన్ని వయసుల వారికీ అనువైనవిగావున్న యోగాసనాలను ప్రొటోకాల్ కమిటీ డిజైన్ చేసిందని, క్లిష్టమైన సూర్య నమస్కారాన్ని అందులో చేర్చలేదన్నారు. అయితే, సూర్య నమస్కారం ఆచరించాలన్న ఆసక్తి వున్నవాళ్ల కోసం కార్యక్రమం పూరె్తైన తరువాత ప్రత్యేక సమయంలో అభ్యాసన చేయించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొంచిన వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తూ, ప్రపంచ యోగా డే పోర్టల్‌గా ఇది కొనసాగుతుందన్నారు. ప్రపంచ యోగా ఉత్సవాలను జూన్ 21న రెండోసారి నిర్వహించేందుకు దేశంలో పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజున చండీగఢ్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.