జాతీయ వార్తలు

హోదాపై నోరువిప్పరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 29: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎన్నికల హామీని భాజపా తుంగలో తొక్కిందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన రామకృష్ణ విలేఖరులతో ఆదివారం మాట్లాడారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పుస్తకాలు వేయించుకున్న వెంకయ్యనాయుడు,కేంద్రమంత్రిగా ఏపీకి ఇచ్చిన హామీలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వెంకయ్య భాజపా ఇచ్చిన హామీలను వక్రీకరించి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయని హామీ ఇచ్చినప్పుడు తెలియదా అని రామకృష్ణ ప్రశ్నించారు. ఇవ్వాల్సిన దానికంటే ఏక్కవ ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నమని భాజపా అనడంలో వాస్తవం లేదని, రైల్వేజోన్,కడప స్టీల్ ఫ్యాకర్టీ ఏర్పాటు గురించి కేంద్రం మరచిపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీ మహానాడులో కొత్తదనం ఏమీలేదని పాత చింతకాయ పచ్చడిగా రామకృష్ణ అభివర్ణించారు.ప్రత్యేక హోదపై అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఢీల్లీ తీసుకెళ్లాలని రామకృష్ణ తెలిపారు.
హోదా ఇవ్వాల్సిందే
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
అనుమసముద్రంపేట, మే 29: విడిపోయిన రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం సముచితమని తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన నెల్లూరు జిల్లాలోని ఎఎస్ పేట దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ విడిపోయినప్పటికీ ఆంధ్రా, తెలంగాణా రెండూ సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు. ఆంధ్రాను పెద్దన్నగా భావిస్తామన్నారు. అజ్మీర్‌లో ఐదు కోట్ల రూపాయలతో తెలంగాణా రాష్ట్రం తరపున యాత్రికుల సౌకర్యాల కోసం ప్రత్యేకంగా ఓ భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణాకు చెందిన ముస్లిం సోదరులు ఎక్కువగా ఎఎస్ పేటకు వస్తుంటారన్నారు. అందువల్ల ఎఎస్ పేటలో కూడా భక్తుల సౌకర్యార్ధం తమ రాష్ట్రం తరపున ముఖ్యమంత్రితో చర్చించి ఓ భవన నిర్మాణానికి సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల ప్రజల కోసం సిఎం కెసిఆర్, చంద్రబాబుల మేలు కోరుతూ ప్రార్ధనలు చేపట్టినట్లు ఆయన వివరించారు.