జాతీయ వార్తలు

పొగాకు వినియోగ నియంత్రణకు కృషి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: పొగాకు వినియోగాన్ని నిరోధించడంలో స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంస్థలు భాగస్వాములు కావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా పిలుపునిచ్చారు. ఒక్కో సంస్థ అయిదారు పాఠశాలలను దత్తత తీసుకొని, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించడంద్వారా చిన్న వయస్సులోనే వారిని చైతన్యవంతులను చేయాలని ఆయన సూచించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగంవల్ల వచ్చే వివిధ రకాల వ్యాధుల వివరాలను తెలియజేస్తూ భారీ పరిమాణంలో గ్రాఫిక్ చిత్రాలతో కూడిన హెచ్చరికలను విడుదల చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల విద్యార్థి దశలోనే పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు పొగాకు వినియోగాన్ని ప్రారంభించబోరని ఆయన వివరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి ఈ పిలుపునిచ్చారు. ‘మనం ఒకదాని తరువాత ఒకటి చొప్పున క్యాన్సర్ ఆసుపత్రులను నిర్మించగలం. మరిన్ని పడకలు ఏర్పాటు చేసి వాటిని రోగులతో నింపగలం. కాని, ఈ వ్యాధిని నిరోధించడం మీద దృష్టి కేంద్రీకరించవలసి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వేను ఆయన ప్రస్తావిస్తూ, భారతదేశంలో ప్రజల్లో చైతన్యం పెరుగుతున్నప్పటికీ నేటికి వయోజనుల్లో 35 శాతం మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారని వివరించారు. అయితే పొగాకు వినియోగదారుల్లో 50 శాతం మంది ఆ అలవాటును మానుకోవాలని కోరుకుంటున్నారని కూడా ఈ నివేదిక వెల్లడించిందని ఆయన వివరించారు. ఇది సానుకూల అంశమని, మనం ఈ దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పొగాకు వినియోగాన్ని మానుకోవాలని కోరుకుంటున్న వారికి సహకరించేందుకు మంత్రి ‘నేషనల్ టుబాకో సెషేషన్ క్విట్‌లైన్’ను ప్రారంభించారు. పొగాకు నియంత్రణ ప్రచార సామగ్రిని కూడా ఆయన విడుదల చేశారు. పొగాకు వినియోగం వల్ల నాలుగు ప్రమాదకరమైన వ్యాధులు కార్డియో వాస్కులర్, క్యాన్సర్, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వెల్లడించిందని మంత్రి తెలిపారు.