జాతీయ వార్తలు

శాస్ర్తియ దృక్పథం లేని కోర్టు ఆదేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, మే 30: న్యాయస్థానాలు జారీ చేస్తున్న కొన్ని ఆదేశాలు అర్థరహితంగా ఉన్నాయని, వాటికి ఎలాంటి శాస్ర్తియ పునాదిలేదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సోమవారం ఇక్కడ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సైన్స్ అంటే తెలియని కొందరు వ్యక్తులు వాటిని అన్వయిస్తున్నారని, ఎలాంటి శాస్ర్తియ దృక్పధం లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి సంబంధించిన ఓ వార్తను ఉదహరించారు. భారత్‌లో తాము పెట్టుబడులు నిలిపివేయడానికి కారణం ఓ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తమకు ఏమాత్రం అర్థంకాకపోవడమేమనని, అలాగే డీజిల్ వాహనాలను రద్దు చేయడం వెనక ఉద్దేశం ఏమిటో తమకు స్పష్టం కాకపోవడమేనని ఆ సంస్థ పేర్కొన్నట్టు పారికర్ గుర్తుచేశారు. వాతావరణాన్ని కలుషితం చేస్తున్న డీజిల్ వాహనాలను రద్దుచేయడంలో అర్థం ఉందిగాని పెట్రోల్‌కంటే తక్కువ కాలుష్యకారకమైన డీజిల్ వాహనాలను నిషేధించడంతో ఉద్దేశం అర్థంకావడం లేదని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల్లో భాగంగా నిర్వహించిన అనేక టాయిలెట్లు కేవలం మూడు నాలుగేళ్ల వ్యవధిలోనే నిరుపయోగంగా మారిపోతున్నాయని వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా పారికర్ అన్నారు. కొందరు వ్యక్తులు ఈ టాయిలెట్లను చెత్తాచెదారం నింపడానికి ఉపయోగిస్తున్నారని, ఇంకొందరైతే వీటని ఉద్దేశిత అవసరాలకు వాడడం లేదని మంత్రి చెప్పారు. చెత్తా చెదారం శుద్ధి చేయడం అన్నది భారత దేశంలో ఓ భారీ వ్యాపారమని, ఇందుకు సంబంధించిన కేంద్ర పథకాలను ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.