జాతీయ వార్తలు

స్టేషన్ల అభివృద్ధి వేగవంతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ విషయంలో రైల్వేలు మరింత ఆశావహ దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. రైల్వే శాఖతో పాటు రోడ్లు, రహదారుల శాఖ పనితీరుపై సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించి న సమీక్షా సమావేశంలో ప్రధాని ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ నమూనాలను అధ్యయనం చేసి రోడ్ల అభివృద్ధికి అత్యుత్తమ విధానాలను అవలంబించడంతోపాటు ఈ రంగంలోకి మరిన్ని ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులపై ఇరుకుగా ఉండే ప్రదేశాలను వెడల్పు చేయాలని, టోలు వసూలు విషయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించాలని మోదీ సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వేలకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఏడాది కంటే 65 శాతం అధికంగా మొత్తం 93 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు సమకూర్చడం జరిగిందని మోదీ ఈ సమీక్షలో గుర్తు చేశారని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రైల్వేలను మరింత అభివృద్ధి చేయడంతోపాటు వౌలిక వసతుల వినియోగాన్ని వివిధ రంగాలకు విస్తరించాల్సిందిగా ప్రధాని సూచించారని పిఎంఓ తెలిపింది. ‘దేశంలో రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో వృత్తి నైపుణ్యం అభివృద్ధి చెంది రైల్వే ఆదాయం పెరిగేందుకు ఇది దోహదపడుతుంది’ అని ఈ సమీక్ష ముగిసిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు.

సోమవారం న్యూఢిల్లీలో రైల్వేశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ