జాతీయ వార్తలు

విధానానికి విరుద్ధంగాపొత్తా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) రాష్ట్ర శాఖ అనుసరించిన ఎన్నికల వ్యూహాలు.. పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాలకు, పార్టీ రాజకీయ ఎత్తుగడల పంథాకు అనుగుణంగా లేవని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. సిపిఐ(ఎం) రాజకీయ ఎత్తుగడల పంథా ప్రకారం పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి అవగాహన కుదుర్చుకోవడానికి కాని పొత్తు పెట్టుకోవడానికి కాని వీల్లేదు. రెండు రోజుల పాటు జరిగిన సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సమావేశాల అనంతరం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో సిపిఐ(ఎం) పనితీరును ఆ పార్టీ పొలిట్‌బ్యూరో ఈ రెండు రోజుల సమావేశాల్లో సమీక్షించింది. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన సిపిఐ(ఎం) కేవలం 26 స్థానాలను గెలుచుకొని మూడో స్థానంలోకి దిగజారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ బలం 14 స్థానాలు తగ్గింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కన్నా రెండు స్థానాలను అధికంగా గెలుచుకొని 44 స్థానాలతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడంపై అసంతృప్తి ఉన్నప్పటికీ, బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు ప్రతిపక్షాల సభ్యులపై చేస్తున్న అమానుష దాడులకు వ్యతిరేకంగా రెండు పార్టీలు ఇతర పక్షాలతో కలిసి ఉమ్మడి పోరాటాన్ని ప్రారంభించాలని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న బిజెపిని కూడా ఈ ఉమ్మడి పోరాటంలో కలుపుకొని పోతారా? అన్న ప్రశ్నకు సీతారాం ఏచూరి స్పందించలేదు. తృణమూల్ కాంగ్రెస్ ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్షాలపై దాడులను ప్రారంభించిందని సీతారాం ఏచూరి తెలిపారు. అనేక మంది సిపిఐ(ఎం) కార్యకర్తలు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సిపిఐ(ఎం)కు చెందిన 600కు పైగా పార్టీ కార్యాలయాలను లూటీ చేయడంతో పాటు ధ్వంసం చేశారనిఏచూరి వివరించారు.